యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి.
అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇది వరకు అయితే కనీసం షూట్ అప్డేట్స్ అయినా ఉండేది కానీ ఇపుడు ఏవి కూడా లేవు.
మరి గ్యాప్ లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలే స్వయంగా చిత్ర దర్శకుడు ఓంరౌత్ నుంచే బయటకి వచ్చాయి.
మరి నేషనల్ మీడియాతో ఓంరౌత్ మాట్లాడుతూ స్టన్నింగ్ అప్డేట్స్ ని అందించారు.
మొదటగా తాను మాట్లాడుతూ ఈ సినిమా వారికి ఎంత ముఖ్యమో ఎంత పవిత్రంగా ఉంచుతున్నారో చెప్పాడు.
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా డ్రైవ్ ని రాముని చరణాల దగ్గర ఉంచామని ఇప్పటికీ కాపీ అలాగే ఉందని తాను తెలిపారు. ఇది మాత్రం సినిమా యూనిట్ పై మరింత గౌరవాన్ని పెంచింది అని చెప్పాలి.
అయితే ప్రస్తుతానికి ఈ భారీ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మళ్ళీ చేసుకుంటూ ఉండగా ఈ జూన్ రిలీజ్ కి అయితే సినిమాని ఫిక్స్ చేశారు.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మరియు జానకి దేవి పాత్రలో కృతి సనన్ నటించగా లంకేశుని పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు అలాగే లక్ష్మణుని సన్నీ సింగ్ నటించాడు.
ఇక సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.