కొందరు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆహారంలో పరోటాను తినడానికి ఇష్టపడతారు. ఇందులో ఏముంది విశేషం అనుకుంటున్నారా.
ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలిస్తే పరోటా తినడం దాదాపుగా తగ్గిస్తారు. అసలు విషయం ఏమిటంటే మనం తిన్న ఆహారం త్వరగా సంపూర్ణంగా జీర్ణం అవ్వడానికి ఫైబర్ ఎంతగానో తోడ్పడుతుంది.
కానీ పరోట తయారీలో ఉపయోగించే మైదాపిండిలో ఫైబర్ దాదాపుగా శూన్యం. కావున పరోటాను అతిగా తింటే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.
తాజా అధ్యయనాల ప్రకారం మైదాపిండిని ఎక్కువగా తినే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని తెలుస్తోంది.
మైదా పిండితో చేసే పరోటాలను ఎప్పుడో ఒకసారి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అదే రోజువారి ఆహారంలో తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి
కారణం మైదాపిండిలో పీచు పదార్థం తక్కువగా ఉండి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కావున గ్యాస్టిక్ మలబద్ధక సమస్యతో బాధపడాల్సి వస్తుంది.
పైగా మైదా పిండిలో ఉండే జిగట స్వభావం పేగులకు అతుక్కొని ఉండడం వల్ల పేగుల్లో అలర్జీ సమస్యలు తలెత్తి అల్సర్, పుండ్లు, జీర్ణాశయ క్యాన్సర్ సమస్యకు దారి తీయవచ్చు.
మైదా పిండితో చేసే పరోటాను అతిగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నిల్వలు అమాంతం పెరిగి డయాబెటిస్ వ్యాధి నియంత్రణ కోల్పోతుంది.
మైదాలో ఉండి చెడు కొలెస్ట్రాల్ వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది
మైదాపిండిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక క్యాలరీలు లభ్యమయి పొట్ట చుట్టూ కొవ్వు పరిమాణం పెరుగుతుంది
ఫలితంగా శరీర బరువు నియంత్రణ కోల్పోతుంది. కొందరిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడి తీవ్రమైన నొప్పి, కిడ్నీ ఇన్ఫెక్షన్లతో బాధపడాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.