సాధారణంగా చాలామందికి ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది.
ఈ క్రమంలోనే వాళ్లకు నీళ్లు దప్పిక వేసిన ప్రతిసారి నీళ్లకు బదులుగా కూల్ డ్రింక్స్ లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారు.
ఇలా తక్కువ పరిమాణంలో నీటిని తీసుకొని దాహం వేసిన ప్రతిసారి ఇలా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల
పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని పలు పరిశోధనల ద్వారా వెళ్లడైంది.
సాధారణంగా మనకు దాహం వేసినప్పుడు మన శరీరంలో నీటి శాతం తగ్గితేనే మనకు దాహం అనే భావన కలుగుతుంది.
ఇలా మన శరీరం నీటిని కావాలని మనకు తెలియజేసినప్పుడు మనం నీటికి బదులుగా ఇతర కూల్డ్రింక్స్ లేదా ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు అప్పటికీ మనకు దప్పిక తీరి
మన శరీరం నీటి శాతాన్ని కలిగి ఉన్నప్పటికీ నీటి శాతంతో పాటు మన శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి.
దీంతో కొన్నిసార్లు మధుమేహానికి గురి కావాల్సి ఉంటుంది అలాగే మరికొందరిలో అధిక శరీర బరువు పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి.
అందుకే నీటికి బదులు ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు.
ఇక డైటింగ్ చేసేవారు ముఖ్యంగా నీళ్లకు బదులు కూల్డ్రింక్ అధికంగా తాగటం వల్ల శరీర బరువు తగ్గడం ఏమో కానీ మరింత శరీర బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే డైటింగ్ చేసే వాళ్ళు పూర్తిగా నీళ్లు దప్పికైనా అప్పుడు నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల శరీర బరువులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి.
నీటికి బదులు కూల్ డ్రింక్ తాగే వారిలో ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మలబద్ధకసమస్యలతో పాటు
ఇతర సమస్యలు కూడా వెంటాడే అవకాశాలు ఉన్నాయి కనుక పూర్తిగా నీటిని తీసుకోవడమే ఎంతో మంచిది.