మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం పట్ల ప్రజలకు అపారమైన నమ్మకం కూడా ఉంది.
అందుకే ఇంటిని నిర్మించుకునేటప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువుల అమర్చుకునేటప్పుడు కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.
ఇలా వాస్తు శాస్త్రం పట్ల నమ్మకం కలిగిన ప్రజలు కొన్ని సందర్భాలలో వారికు తెలియకుండా వాస్తు నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటారు. వాస్తు నియమాలకు విరుద్ధంగా రాత్రిపూట కొన్ని పనులు చేస్తూ ఉంటారు.
శాస్త్రం ప్రకారం రాత్రిపూట ఇలాంటి పనులు చేయటం అనేక సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా దూరం అవుతారు.
వాస్తు శాస్త్ర ప్రకారం రాత్రిపూట ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఇంట్లో చీపురు పట్టుకొని చెత్త ఉడ్చకూడదు.
ఎందుకంటె చీపురు ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల రాత్రి సమయంలో చీపురుతో చెత్త ఊడ్చటం వల్ల మన కుటుంబానికి లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో తల దువ్వడం వంటి పనులు కూడా చేయరాదు. సూర్యాస్తమయానికి ముందే మహిళలు తల దువ్వుకోవాలి.
కానీ సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పూజ చేసిన తరువాత తల దువ్వుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని భోజనం చేయటం కూడా వాస్తు నియమాలను ఉల్లంఘించినట్లు అర్థం.
ఇలా స్త్రీ పురుషులు మంచం మీద కూర్చుని భోజనం చేయటం వల్ల కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.
అలాగే సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకటం కూడా వాస్తు నియమాలకు విరుద్ధం. బలహీనంగా ఉన్నవారు సగ్గుబియ్యంను ఆహారంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
సురేస్తమయం తర్వాత బట్టలు ఉతకడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించడమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురికావల్సి వస్తుంది.