ఇలాంటి మొక్కలు మీ ఇంట్లో పెంచుతున్నారా అయితే మీరు ప్రమాదంలో పడినట్లే?

 మొక్కలు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 అయితే కొన్ని మొక్కలు మన ఆరోగ్యం మరియు మన చుట్టూ ఉన్న పెంపుడు జంతువుల ఆరోగ్యం పై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

 అందుకే కొన్ని రకాల మొక్కలను మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పెంచకపోవడమే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. ఆ మొక్కల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఒలియాండర్ మొక్క దీన్ని ప్రాంతీయంగా గన్నేరు మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్క పూలు చాలా అందంగా అందరినీ ఆకర్షిస్తున్నప్పటికీ ఈ మొక్క ఆకుల్లో మరియు పూలల్లో కొంత విషపదార్థం కలిగి ఉంటుంది

 ఈ పూల సువాసనను పీల్చినప్పుడు మనలో శ్వాస సంబంధిత సమస్యలు ,తలనొప్పి, వాంతులు, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు.

 అందుకే పిల్లలను ఈ మొక్క పూలకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఒలియాండర్ మొక్కలను ఇంటి ఆవరణలోనూ ఆఫీసుల్లో పెంచుకోకపోవడమే మంచిది.

  మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే ఆర్థికపరమైన సమస్యలు తొలుగుతాయని అందరూ చెబుతుంటారు.

అయితే ఈ మొక్క ఆకులను చిన్నపిల్లలు లేదా పెంపుడు జంతువులు పొరపాటున తింటే శ్వాసకోశ సమస్యలు, కడుపులోమంట, విరేచనాలు, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి

సాధారణంగా మన ఇంట్లో లేదా ఆఫీస్ డేస్కుల పైన పెంచుకోవడానికి ఇష్టపడే సక్యూలెంట్స్ ప్లాంట్స్, అరెకా మొక్కలు చిన్నగా చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ

 ఈ మొక్కలు ఎక్కువగా మీలీబగ్స్ కీటకాలను, సాలీడు జాతి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇవి మన ఆరోగ్యం పై మన చుట్టూ ఉన్న మొక్కలపైన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

 బోన్సాయ్ మొక్కలను ఇంట్లో పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వీటివల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

 బోన్సాయ్ మొక్కలను ముట్టుకున్న తర్వాత కచ్చితంగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.