మనలో పొటాషియం మూలకం లోపిస్తే ఈ అనారోగ్య సమస్యలు తప్పవా?

 ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సమృద్ధిగా ప్రోటీన్స్ ,విటమిన్స్ ,మినరల్స్ ,కార్బోహైడ్స్, ఖనిజ లవణాలు లభించకుంటే మనలో పోషకాహార లోపం తలెత్తి భవిష్యత్తులో అనేక అనారోగ్య రుగ్మతలకు కారణం కావచ్చు.

 ముఖ్యంగా ఈరోజు మనం మన శరీరంలో పొటాషియం మూలకం లోపిస్తే కలిగే అనారోగ్య సమస్యలు , పొటాషియం మూలకం సమృద్ధిగా కలిగిన ఆహార పదార్థాల గురించి కూడా తెలుసుకుందాం.

 ముందుగా మన శరీరంలో పొటాషియం మూలకం యొక్క ఆవశ్యకత గురించి చెప్పుకుంటే పొటాషియం మూలకం రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి

 రక్తపోటు సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది, అలాగే మన శరీరంలోని కణాల ద్రవసాంద్రతలను నియంత్రించడంలో సహాయపడి కండరాలు, నరాలు పనితీరును పెరుగు పరుస్తుంది.

 గుండె కండరాలను దృఢపరిచి గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ సంశ్లేషణకు, కార్భోహైడ్రేట్లను గ్రహించడంలో సహాయపడుతుంది.

 కండరాల్లో మీరు చేరి వాపు రావడం, కండరాల నొప్పులు, తిమ్మిర్ల సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది.

 మన శరీరంలో పొటాషియం మూలకం లోపిస్తే రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి రక్త పోటు సమస్య తలెత్తుతుంది.

 గుండె దడ గుండె కొట్టుకునే వేగం కూడా మందగిస్తుంది. కొందరిలో మలబద్ధక సమస్య కూడా ఏర్పడుతుంది. కండరాలు బలహీనంగా మారి అలసట, నీరసం, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 ఈ విధమైన లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవాలి. సాధారణంగా మన శరీరంలో పొటాషియం స్థాయి 3.5 నుంచి 5.2 వరకు ఉంటుంది.

 3.5 కంటే తక్కువ పరిమాణంలో పొటాషియం ఉంటే మీరు హైపోకలేమియా సమస్య తలెత్తుతుంది.

 పొటాషియం లోపాన్ని సవరించుకోవాలంటే పెద్దలకు రోజుకు 1600 నుంచి 2000 మి.గ్రా పొటాషియం అవసరమవుతుంది.

 సిట్రస్ జాతి ఫలాలైన నిమ్మ, బత్తాయి, నారింజ, దానిమ్మ వంటి పండ్ల రసాల్లో సమృద్ధిగా పొటాషియం లభ్యమవుతుంది.

 అలాగే చిక్కుడు జాతి కాయగూరల్లో కూడా మెండుగా పొటాషియం నిల్వలు ఉంటాయి. అలాగే పాలు, గుడ్లు, పెరుగు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, చేపలు వంటి వాటిల్లో సమృద్ధిగా పొటాషియం లభ్యమవుతుంది.