ప్రస్తుత కాలంలో మనం తయారు చేసుకుని అన్ని ఆహార పదార్థాలలో ఉపయోగించే మసాలా దినుసులలో తప్పనిసరిగా బిర్యానీ ఆకు కూడా ఉంటుంది.
ఈ బిర్యానీ ఆకూ కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.
అయితే ఈ బిర్యానీ ఆకు వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే….
బిర్యానీ ఆకు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము ఇక్కడ తెలుసుకుందాం….వంటలలో ఉపయోగించే ఈ బిర్యాని ఆకు వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది .
అంతే కాకుండా ఈ ఆకుల లో ఉన్నటువంటి టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, అలాగే కీచైన్ వంటి ఫైటోకెమికల్స్ లాంటివి కూడా పుష్కలంగా ఇందులో లభిస్తాయి .
అంతేకాకుండా ఈ బిర్యానీ ఆకులు లో విటమిన్ ఏ, సి , ప్రొటీన్ ఐరన్,క్యాల్షియం పొటాషియం, మెగ్నీషియం, కాపర్,జింక్,సోడియం పాస్ఫరస్ ఇంకా కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి.
వీటి కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ డయాబెటిక్ సమ్మేళనాల కారణంగా ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో ఉంచుటకు ఉపయోగపడుతుంది.
అంతే కాకుండా దీనిని టీ గా కూడా మార్చుకొని త్రాగవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, ఫంగల్ వంటి ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలోనూ,
జుట్టుకు సంబంధించిన చుండ్రు లాంటి సమస్యలను నియంత్రించడం లోనూ, బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా వీటిని సరైన మోతాదులో తీసుకోవడం కూడ చాలా మంచిది.