ఎప్పుడో గత ఏడాది ఆగస్టులో విడుదలవ్వాల్సిన సినిమా ‘ఏజెంట్’.
అప్పటినుంచి ఇప్పటిదాకా సినిమా షూటింగ్ కొన‘సాగు’తూనే వుంది.
సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది, రిపేర్ల వ్యవహారం నడుస్తోందన్నది లేటెస్ట్ అండ్ హాటెస్ట్ గాసిప్.
ఎలాగైనా సినిమా మీద బజ్ మళ్ళీ పెంచడం కోసం చిత్ర యూనిట్ నానా రకాల స్టంట్లూ చేస్తోంది.
ఈ క్రమంలోనే దర్శకుడు సురేందర్ రెడ్డికి గాయమైందా.? మరీ, గాయాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ అని ఎలా అనగలంగానీ..
అంటున్నారు కొందరు. సరే, ఆ సంగతి పక్కన పెడితే, వేసవిలో ‘ఏజెంట్’ సినిమా విడుదలవుతుందట.
నమ్మొచ్చా.? అప్పటికల్లా రిపేర్లు పూర్తయిపోతాయా.? అన్న డౌట్ చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ‘ఏజెంట్’ సినిమా మీద గతంలో చాలా బజ్ క్రియేట్ అయ్యింది.
కానీ, దాన్ని చిత్ర యూనిట్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. దసరా పాయె.. సంక్రాంతి కూడా పాయె. సినిమా మీద బజ్ కూడా పాయె.!
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘కమర్షియల్ హంగులు’ అద్దేందుకోసమే ఈ రిపేర్లు అని తెలుస్తోంది.