పిల్లలు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారా… పొరపాటున కూడా తల్లిదండ్రులు ఇలా చేయకండి?

 ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం పిల్లల పెంపకం ఎంతో కష్టతరమైనది అనే విషయం మనకు తెలిసిందే.

  పిల్లలని చూసుకోవాలి అంటే పేరెంట్స్ కి ఎంతో ఓపిక ఉండాలి. ఇంట్లో పిల్లలు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, వారు చేసే అల్లరి , వారి మాటలు సంతోషాన్ని కలిగిస్తాయి.

 అయితే కొన్ని సందర్భాల్లో అవే చికాకు కూడా తెప్పిస్తాయి. కొన్ని సార్లు వారికి కావాల్సినవి సాధించుకోవడానికి ఏడుస్తూ మారాం చేస్తుంటారు.

 పిల్లలకి కోపం వచ్చినపుడు కొంత మంది ఏడుస్తారు, మరి కొంతమంది అలుగుతారు. ఇటువంటి సమయాల్లో పేరెంట్స్ సంయమనం పాటించాలి.

 కోపంలో వారు చేసే పనికి అడ్డు పడితే ప్రళయం సృష్టిస్తారు. దీనివల్ల పిల్లలు ఏం చెప్పినా పేరెంట్స్ వింటారు అనే అపోహలో పిల్లలు ఉంటారు.

 పిల్లలు వారికి కావాల్సింది సాధించడానికి, నచ్చనిది తెలియజేయడానికి ఎక్కువగా అలగటం లేదా ఏడవడం చేస్తుంటారు.

 అటువంటి సమయాలలో వారు మనకి ఏమి తెలియజేయాలి అనుకుంటున్నారో ఒకసారి పిల్లలకి ఛాన్స్ ఇచ్చి వినండి. ఇలా చేయడం వల్ల పిల్లలు కొంత శాంతిస్తారు.

 పిల్లలు కోపంగా ఉంటే వారితో పాటు మీరింకా కోప్పడి వారిని కొట్టడం లేదా తిట్టడం చేయకండి. మనకు ఏదైనా కావాల్సింది దొరకకపోతే ఎంత నిరాశ చెందుతామో తెలుసు కదా, పిల్లలు కూడా అంతే.

 వారు ఏ విషయం గురించి కోపంగా ఉన్నారు ఆ విషయం గురించి సర్దిచెప్పి వారిని శాంతపరచండి.పిల్లలను శాంత పరచడానికి ఈ మధ్యకాలంలో లంచం ఇవ్వడం అలవాటు చేస్తున్నారు.

 పిల్లలు హోమ్ వర్క్ చేయాలన్న, అన్నం తినాలన్న వారికి అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని అలవాటు చేస్తున్నారు. అలా చేయడం వల్ల పిల్లలు పెద్దయ్యాక కూడా అలాగే అలవాటు పడతారు.

 పిల్లలకు ఇలా కమిషన్లు ఇవ్వడం అలవాటు చేయడం చాలా పెద్ద తప్పు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.