టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల అయినటువంటి నటసింహ బాలకృష్ణ
అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోలుగా నటించిన చిత్రాలు మళ్ళీ చాలా కాలం తర్వాత సంక్రాంతి పోటీలో తలపడనున్నాయి.
ఇక అలా లేటెస్ట్ గా మెగాస్టార్ నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని అయితే చిత్ర బృందం సినిమా నేటివిటీకి దగ్గరగా ఉంటుంది అని వైజాగ్ సాగరతీరంలో ప్లాన్ చేశారు.
కానీ ఆడియెన్స్ రక్షణార్థం ఏపీ ప్రభుత్వం తీసుకున్న లేటెస్ట్ డెసిషన్ తో అయితే ఒక్కసారిగా మేకర్స్ కి షాక్ తగిలింది.
కానీ ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ అయితే సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. అధికారులు అయితే వైజాగ్ లో ఆర్ కే బీచ్ లో ఈవెంట్ కి గాను పర్మిషన్ ఇవ్వలేదట.
కానీ ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ లో అయితే వాల్తేరు వీరయ్య ఈవెంట్ ని జరుపుకోవచ్చని లైన్ క్లియర్ చేశారట.
దీనితో అయితే ఫైనల్ గా మెగాస్టార్ సినిమాకి చిక్కులు తొలిగాయి.
ఇంకా ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తుండగా హీరోయిన్స్ గా శృతి హాసన్ మరియు క్యాథరిన్ ట్రెసా నటించారు.
అలాగే దర్శకుడు బాబీ తెరకెక్కించాడు అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కాబోతుంది.