మరో మల్టీస్టారర్.! సరిజోడీ కోసం వెతుకుతున్న రవితేజ.!

 ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని.. కేవలం మెగాస్టార్ చిరంజీవి సినిమాగా చూడగలమా.? చూడాల్సిందే.

 అయినాగానీ, అది మల్టీస్టారర్. రవితేజ ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు మరి.!

 ‘ఇంకోసారి మనిద్దరం ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ సినిమా చేద్దాం అన్నయ్యా.. స్టార్టింగ్ నుంచీ ఎండింగ్ వరకు రచ్చ రచ్చ చేసెయ్యాలి..’

 అంటూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సమయంలో రవితేజ, చిరంజీవి సాక్షిగా చెప్పాడు. కానీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా.?

 ఏమోగానీ, రవితేజకి అత్యంత సన్నహితుడైన ఓ డైరెక్టర్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ కథతో వచ్చాడట ఈ మధ్యనే. ఇద్దరు హీరోలు..

 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ.. రవితేజ కోరుకున్నట్టే రచ్చ రచ్చ చేస్తాయట అందులోని ప్రధాన పాత్రలు.

 ప్రస్తుతం రవితేజ, తెరపై తన సమ ఉజ్జీ కోసం చూస్తున్నాడట. తన వయసు హీరోతోనే

 ఆ సినిమా చేయాలన్నది రవితేజ ఆలోచనగా కనిపిస్తోంది.