మెగా ఫ్యామిలీలో మరొక శుభవార్త… ఆనందంలో అభిమానులు..?

 టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి పైగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

 ఇలా మెగా కుటుంబం నుండి వచ్చినా ఎంతోమంది ఇండస్ట్రీలో హీరోలుగా రానేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

 ఇక రామ్ చరణ్ ఉపాసన కామినేని ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

 ఇప్పటికే వీరి వివాహం జరిగి పది సంవత్సరాల పూర్తి కావడంతో మెగా వారసుడు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంతకాలం మెగా కుటుంబ సభ్యులు, మెగా అభిమానుల ఎదురుచూపుకు ప్రతిఫలం లభించనుంది.

 రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించాడు. దీంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

 ఇక మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇప్పటికే మెగా కుటుంబం నుండి వచ్చిన ఈ శుభవార్త వల్ల మెగా అభిమానులు సంతోషంలో ఉండగానే మరొక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.

 మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. చాలా కాలంగా వరుణ్ తేజ్ వివాహం గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 తాజాగా వరుణ్ తేజ్ పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం పెళ్లి విషయాని దాచిపెడుతూ వచ్చిన వరుణ్ తేజ్ త్వరలోనే తన పెళ్లిపై అఫీషియల్ గా ప్రకటించనున్నాడని సమాచారం.

 ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి కూడా వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో పాజిటివ్ కామెంట్స్ చేశాడని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా మెగా కుటుంబం నుండి వరుసగా గుడ్ న్యూస్ వినిపించడంతో మెగా అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

 అయితే వరుణ్ తేజ్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి కి సంబందించిన విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

 అయితే గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి లో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడూ వరుణ్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడా? లేక మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడా? అని డౌట్ వచ్చింది.