మరో గీత గోవిందం.. చర్చలు స్టార్ట్!

 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యధిక స్థాయిలో ప్రాఫిట్ అందించిన సినిమాలలో గీతగోవిందం ఒకటి

 పరుశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఒక విధంగా డైరెక్టర్ పరుశురామ్ కు ఇది మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.

 మహేష్ బాబుకు కూడా బాగా నచ్చడంతో అతనికి ఆఫర్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అంతలా అతని కెరీర్ కు ఉపయోగపడడమే కాకుండా ఆర్థికంగా కూడా అతనికి ఆ సినిమా మంచి లాభాలను అందించింది.

 ఎందుకంటే నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా సక్సెస్ లో అతనికి షేర్ ప్రాఫిట్ ఇచ్చారు. దీంతో అతని లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.

 అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటి గీతగోవిందం కథకు సీక్వెల్ తెరిపైకి తీసుకువచ్చే చర్చలు మొదలవుతున్నట్లుగా తెలుస్తోంది. కథ వర్కౌట్ అయితే త్వరలోనే ఈ కాంబో పట్టాలు ఎక్కవచ్చు.

 హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటకు ఎంతగా గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వారు హాలిడేస్ అంటూ విదేశాను కూడా చుట్టేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు.

 ఇక ఈ క్రమంలో గీతగోవిందం 2 కు సంబంధించి చర్చలు మొదలైనట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది.

 ఇక దర్శకుడు పరుశురామ్ ఇంతకుముందు అయితే నాగచైతన్యత ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది క్యాన్సల్ అయ్యింది.

 ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ సమంతతో ఖుషి అనే సినిమాను పూర్తి చేసే పనిలో కూడా ఉన్నాడు.

 అలాగే గౌతమ్ తిన్నానూరితో కూడా ఇటీవల ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.