ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో భారీ క్రేజ్ అండ్ మంచి మార్కెట్ ఉన్న నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
తన లాస్ట్ రెండు సినిమాలు అంతగా రాణించకపోయినప్పటికీ ఇక నుంచి రానున్న సినిమాలు మరింత భారీ స్థాయిలో వెళ్తున్నాయి.
ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ ఆల్రెడీ తన మొదటి బాలీవుడ్ సినిమాగా దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” అనే మాసివ్ ప్రాజెక్ట్ చేయగా
తాను బాలీవుడ్ లో మరో సినిమా లాక్ చేసినట్టుగా కొన్ని గాసిప్స్ ఆ మధ్య వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ గాసిప్స్ నిజం అయ్యాయి.
లేటెస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం “వీరసింహా రెడ్డి” చిత్ర యూనిట్ తన టాక్ షో కి రాగా
అందులో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవి లు ప్రభాస్ తో సినిమాని కన్ఫర్మ్ చేశారు.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తోనే తమ సినిమా ఉండగా ఈ సినిమాతో తాము డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలిపారు.
దీనితో ప్రభాస్ నుంచి మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లాక్ కాగా మైత్రి మూవీ మేకర్స్ కి కూడా పాన్ ఇండియా ఎంట్రీ కి సరైన ప్లాట్ ఫామ్ దొరికింది అని చెప్పాలి.
అయితే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందో చూడాలి. మరి సిద్ధార్థ్ ఆనంద్ నుంచి అయితే ఇప్పుడు మరో భారీ ఏక్షన్ చిత్రం “పఠాన్” షారుఖ్ ఖాన్ నటించింది రిలీజ్ కి రానుంది.