ఇద్దరి కొడుకుల వల్ల భారీగా నష్టపోయిన అనసూయ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన అనసూయకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం దప్పించుకున్న అనసూయ కామెడీ షో వల్ల యాంకర్ గా బాగా పాపులర్ అయింది.

ఇక ఈ షోలో అనసూయ తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా మంచి గుర్తింపు పొందడంతో అనసూయ కి సినిమాలలో నటించే అవకాశాలు కూడా దక్కాయి.

ఇలా జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ సినిమాలలో నటించడానికి సమయం కుదరకపోవటంతో ఆమె జబర్దస్త్ కి దూరం అయింది.

జబర్దస్త్ కి దూరమైన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.

అయితే సోషల్ మీడియాలో అనసూయని అభిమానించే వారి కంటే విమర్శించే వారే ఎక్కువగా ఉన్నారు. అనసూయ ఏ పోస్ట్ షేర్ చేసిన కూడా ఆమెను విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో అనసూయ కూడా అలా తనని విమర్శించే వారికి ఘాటుగా సమాధానాలు చెబుతూ వస్తోంది.

ఇదిలా ఉండగా ఇంతకాలం సినిమాలలో అవకాశాలు రావటం వల్లే అనసూయ జబర్దస్త్ కి దూరమైందని ఆమె అభిమానులు భావించారు.

కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఈ విషయం గురించి స్పందిస్తూ తాను జబర్దస్త్ కి దూరం కావటానికి తన కొడుకులే అసలు కారణమని వెల్లడించింది.

ఒకవైపు జబర్దస్త్ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటంవల్ల కొడుకులతో సమయం కేటాయించలేక పోయిందని

అందువల్లే తన కొడుకుల కోరిక మేరకు జబర్దస్త్ కి స్వస్తి చెప్పి సినిమాలలో నటిస్తూ మిగిలిన సమయాన్ని తన కొడుకులతో గడుపుతున్నట్లు అనసూయ వెల్లడించింది.

అయితే అనసూయ జబర్దస్త్ కి దూరం కావటం వల్ల ఆమె ఆర్థికంగా కూడా నష్టపోయినట్లు తెలుస్తోంది.