పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయ ప్రయాణాలు సాగిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. వరుస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు.
ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ సెట్స్ పైన ఉండగానే వినోదాయ సీతమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్ట్ మొత్తం
మార్చి 14లోపు పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయగానే హరీష్ శంకర్ దర్శకత్వం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.
ఆ తరువాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీని కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. వినోదాయ సీతమ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత హరిహర వీరమల్లు మూవీతో పాటు
మిగిలిన రెండు సినిమాలని కూడా బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ లో ఓజీ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలు అన్ని కూడా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టడానికి జనసేనాని సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అందుకనే గ్యాప్ లేకుండా వీలైనంత వేగంగా
మూడు ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వినోదాయ సీతమ్ సినిమాకి 30 రోజుల కాల్ షీట్స్, ఒజే కోసం 45 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని తెలుస్తుంది.
అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా 40 నుంచి 45 రోజుల కాల్ షీట్స్ ని పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ చేసినట్లుగా టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.
వీటిలో వినోదాయ సీతమ్ మూవీని ఈ ఏడాదిలోనే రిలీజ్చేయబోతున్నారు.అలాగేహరిహరవీరమల్లుమూవీకూడాఆగష్టుతర్వాతరిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేసేలా హరీష్ శంకర్ ఆలోచన చేస్తున్నారు. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.