రాబోయే అద్భుతమైన టాప్ సీక్వెల్స్

 ప్రస్తుతం సౌత్ ఇండియాలో చాలా సినిమాలు సీక్వెల్స్ గా తెరకెక్కుతున్నాయి. మొదటి సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ చేస్తూ మరింత బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంటున్నారు.

 ఫస్ట్ సినిమా హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రంపై ఆటోమేటిక్ గా హైప్ ఉంటుంది. ఈ కారణంగానే బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2

 ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలుగా మారాయి. ఇప్పుడు అలా సౌత్ లో చాలా సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

 అందులో కాంతారా 2 మూవీ ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయ్యింది.

 ఈ నేపధ్యంలో దానికి ప్రీక్వెల్ స్టొరీతో కాంతారా 2ని సిద్ధం చేస్తున్నారు. దీనిపై మంచి హైప్ ఉంది. తరువాత కార్తి ఖైది 2 మూవీ కూడా అలాగే హైప్ క్రియేట్ చేసుకుంది.

 ఖైదికి మించి ఈ సీక్వెల్ ఉంటుందని కోలీవుడ్ ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అలాగే శంకర్ ఇండియన్ 2 మూవీ కూడా సీక్వెల్ గా తెరకెక్కుతున్నదే. ఇండియన్ మూవీ 1996లో వచ్చింది.

 మరల 26 ఏళ్ళ తర్వాత సీక్వెల్ చేస్తున్నారు. దీంతో దీనిపై దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయ్యి ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 వస్తుంది.

 ఈ సీక్వెల్ తో వెయ్యి కోట్లు అందుకోవాలని సుకుమార్, బన్నీ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

 ఇక బోయపాటి, బాలకృష్ణ కలయికలో వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్ కూడా ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. ఈ సారి సీక్వెల్ ని పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 ఇక మోహన్ లాల్ హిట్ ఫ్రాంచైజ్ అయిన దృశ్యం సిరీస్ లో మూడో భాగాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి రెండు సినిమాలు అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

 ఈ నేపధ్యంలో పార్ట్ 2ని తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా సౌత్ లో ప్రస్తుతం చర్చించుకున్న సీక్వెల్స్ పై ఎక్కువగా బజ్ నడుస్తుంది.

 ఇవి రిలీజ్ అయితే కచ్చితంగా సంచలనాలు క్రియేట్ చేస్తాయని అంచనా వేస్తున్నారు.