రాజకీయాల్లోకి రావడానికి సినిమా ఇండస్ట్రీ అనేది కచ్చితంగా దగ్గర దారే! ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు చట్టసభల్లోకి వెళ్లి నిరూపించారు కూడా.
ఇక ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత గురించైతే చెప్పేపనే లేదు! ఈ క్రమంలో చిరు లాంటివారికి కాస్త చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ…
మినిమం గ్యారెంటీ అయితే చిరు చూశారు. ఆ లిస్ట్ లో చేరడానికి ఇప్పటికే పవన్ కల్యాణ్ పోరాడుతుండగా.. ఆలీ కూడా ఆరాటపడుతున్నారు.
సినీనటుల గెలుపోటములు వ్యక్తిగత ప్రతిష్టతోపాటు అప్పటి రాజకీయ పరిస్థితులపై కూడా బలంగా ఆధారపడి ఉంటాయి. ఈ విషయాలు పవన్ కి ఇప్పటికే తెలిసిన విషయం.
ఇప్పుడు ఆలీ వంతు వచ్చింది. పార్టీ ఆదేశిస్తే పవన్ పై కూడా పోటీకి రెడీ అని చెప్పేటంత ఆత్మవిశ్వాసంతో ఆలీ ఉన్న సంగతి తెలిసిందే.
అయితే.. ఆ ఆత్మవిశ్వాసానికి పార్టీకి అనుకూలంగా వీచే గాలులు కూడా చాలా ముఖ్యం! ఈ విషయంలో ప్రస్తుతం వైకాపాకు అనుకూలంగా ఉందా లేదా
అని 2019 అంత కాంఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి! అయినప్పటికీ ఆలీకి ఉన్న క్రెడిబిలిటీ,
సేవా కార్యక్రమాలు చేసే మనస్తత్వానికి తోడు పార్టీకి కాస్త అనుకూల పవనాలు వస్తే మాత్రం.. ఖశ్చితంగా ఆలీ ఆరాటానికి న్యాయం జరగొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో ఆలీ ఇప్పటికే మానసికంగానూ, ఆర్థికంగానూ సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది!
ఇక పవన్ విషయానికొస్తే… పార్టీ అధ్యక్షుడి హోదాలో 2014లో పోటీ చేయలేదు పవన్. అనంతరం చేసిన తప్పిదాలు, వ్యూహాత్మక పొరపాట్ల అనంతరం 2019 లో రెండు చోట్ల పోటీ చేశారు.
కానీ.. ప్రజలు విశ్వసించలేదు. సినిమా వేరు రాజకీయం వేరు అని చెప్పకనే చెప్పారు.
ఈ క్రమంలో 2024లో మరింత బలంగా ముందుకు కదలాలని, మరింత వ్యూహాత్మకంగా ఎన్నికల్లో పాల్గొనాలని పవన్ అభిమానులు, జనసైనికులు కోరుకుంటున్నారు.
మరి ఈసారైనా పవన్ పోరాటానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందేమో చూడాలి! కానీ.. చాలా మంచి స్నేహితులుగా ఉన్న ఆలీ –
పవన్ ల విషయంలో.. ఆలీకి మినిమం గ్యారెంటీ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే… ఆలీ ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.
ఆయన ఆరాటం సక్సెస్ అయినట్లే. కానీ.. పవన్ కి అలా కాదు. తాను ఎమ్మెల్యేగా గెలవడం ఎంత ముఖ్యమో.. తన పార్టీకంటూ మరో నలుగురిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి.
అప్పుడు కానీ పవన్ పోరాటం ఫలించినట్లు కాదు! మరి 2024 ఎన్నికల్లో ఆలీ ఆరాటం నిలుస్తుందా.. పవన్ పోరాటం గెలుస్తుందా అన్నది వేచి చూడాలి!!