జనసేనాని పిలుపు కోసం ఆ ముగ్గురూ వెయిటింగ్.!

 అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. జనసేన పార్టీలోకి దూకేస్తారట.

 అలాగని ఏపీ రాజకీయాల్లో ఓ పెద్ద గుసగుస వినిపిస్తోంది. ‘పార్టీ మారడమైతే ఖాయం.. అదీ జనసేనలోకేనన్నది నిర్వివాదాంశం.

 కాకపోతే, జనసేనాని పిలుపు రావాలి..’ అంటూ ఆయా నేతలు, తమ తమ అనుచరులకు చెప్పుకుంటున్నారట.

 చిత్రమైన పరిస్థితి కదా ఇది.? అసలు ఇది నిజమేనా.? అంటే, నమ్మాల్సిందేనేమో.! ఒకరేమో గంటా శ్రీనివాసరావు. ఇంకొకరేమో అవంతి శ్రీనివాసరావు అట.

 మరొకరేమో కన్నబాబు అట. ఛాన్సే లేదు.. కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు వైసీపీని వీడరు.. అన్నది ఆయా నేతల సన్నిహితులు చెబుతున్నమాట.

 గంటా శ్రీనివాసరావు విషయంలోనూ ‘ఆయన టీడీపీతో సర్దుకుపోతున్నారు’ అనే మాటే వినిపిస్తోంది.

 రాజకీయాలు మారాయ్. గంటా టీడీపీలో.. అవంతి, కన్నబాబు వైసీపీలో వున్నారు.మంత్రి పదవులు అనుభవించారుగానీ,

 ఆ పదవుల నుంచి ఔట్ అయిపోయాక అవంతి, కన్నబాబు.. అస్సలేమాత్రం విలువ లేకుండా పోయారన్న చర్చ వారి వారి నియోజకవర్గాల్లో జరుగుతోంది.

 ఈ నేపథ్యంలో వారికి జనసేన గాలమేయొచ్చన్న ప్రచారం జరగడం సహజమే. గంటా నిజంగానే జనసేన కోసం ట్రై చేశారు, కానీ కుదరలేదు.

 కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌లకు జనసేనలో చోటు లేదంటున్నారు జనసైనికులు. కానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.