మనకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా కడుపునిండా, తృప్తిగా తినేస్తుంటాం.
తర్వాత జీర్ణం అవడంలో సమస్య తలెత్తి కడుపు ఉబ్బరం, గ్యాస్టిక్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలతో ఆరోజు మొత్తం బాధపడాల్సిన పరిస్థితులు చాలాసార్లే ఎదురై ఉంటాయి.
ఇక జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పబోయే ఆరోగ్యకరమైన పానీయాన్ని భోజనం తిన్న వెంటనే సేవిస్తే సరిపోతుంది.
ఆరోగ్యకరమైన పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? భోజనం చేసిన వెంటనే సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా ఆకులు, నిమ్మరసం, నల్ల ఉప్పు, జీలకర్ర వంటి ఔషధ గుణాలు కలిగిన పదార్థాలతో తయారు చేసే జల్ జీరా పానీయాన్ని భోజనం తిన్న వెంటనే సేవిస్తే
మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి కడుపులో చల్లదనాన్ని కలిగించడమే కాకుండా పొట్ట ,పేగుల్లోని మలినాలను బయటికి పంపడంలో ఎంతగానో సహాయపడుతుంది.
జల్ జీరా రిఫ్రెష్ డ్రింక్ జీర్ణశక్తిని పెంచి అజీర్తి, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
జల్ జీరా పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చింతపండును బాగా నానబెట్టి నానిన తర్వాత చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత పుదీనా, కొత్తిమీర, సొంటి , జీలకర్ర, పచ్చిమిర్చి మెత్తటి మిశ్రమంగా మార్చుకుని చింతపండు పానీయంలో కలుపుకొని బాగా మరగనివ్వాలి.
మరుగుతున్న సమయంలోనే కొంత నీరు వేసుకొని బెల్లం, రాక్ సాల్ట్, గరం మసాలా, మిర్యాల పొడి, తగినంత ఉప్పు వంటివి కలిపితే రుచికరమైన జల్ జీరా పానీయం రెడీ
ఈ పానీయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు భోజనం తర్వాత సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీ సొంతమైనట్లే.