బాలయ్యా వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్న అక్కినేని అభిమానులు…!

 టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తరచూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 అంతేకాకుండా తరచూ అభిమానులపై చేయి చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల వీర సింహారెడ్డి సినిమా ద్వారా హిట్ అందుకున్న బాలకృష్ణ తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

 ” వీరసింహుని విజయోత్సవం ” పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అనేక విషయాల గురించి వెల్లడించాడు.

 ఒక సందర్భంలో బాలకృష్ణ మాట్లాడుతూ అలనాటి నటుల గురించి గుర్తు చేసుకుంటూ ‘అక్కినేని తొక్కినేని’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 అయితే బాలకృష్ణ ఎలా మాట్లాడటంతో అక్కినేని అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే బాలయ్య అభిమానులు మాత్రం

 ఏదో తొందరలో అలా మాట్లాడేసాడు అని తమ అభిమాన హీరోని వెనకేసుకొస్తున్నారు. అయితే బాలయ్య ఇలా మాట్లాడటం ఇదేమి మొదటిసారి కాదు.

 ప్రతిసారి ఇలా బాలయ్య నోరు జారిన కూడా చూస్తూ ఊరుకోవటం అన్ని సందర్భాలలో కుదరదు. ఈ క్రమంలో అక్కినేని గురించి చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబ సభ్యులకు కూడా స్పందించారు.

 ఈ క్రమంలో నాగచైతన్య స్పందిస్తూ “నందమూరి తారక రామారావు గారు.. అక్కినేని నాగేశ్వర రావు గారు ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.

 అలాంటి వారిని అగౌరపరచడం అంటే మనల్ని మనమే కించ పరుచుకోవటం..’ అంటూ ట్వీట్ చేస్తూ బాలయ్యకు కౌంటర్ ఇచ్చాడు.

 అక్కినేని నాగేశ్వర రావు వర్ధంతి రోజున బాలకృష్ణ ఇలా ఆయన్ని అవమాన పరుస్తూ మాట్లాడటంతో ఈ వివాదంపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ

 బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అక్కినేని అభిమానులకు అక్కినేని కుటుంబ సభ్యులకు క్షమాపణ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు.

 అయితే బాలయ్య ఈ వివాదం పై ఇప్పటివరకు స్పందించలేదు . బాలయ్య ఈ వివాదం పై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.