ఎక్కడైనా పెద్ద హీరోల నుంచి వస్తున్న సినిమాల కోసం ఆడియెన్స్ బాగా ఎదురు చూడడం ఏమో కానీ
మన దగ్గర మాత్రం రీసెంట్ టైం లో టైర్ 2 హీరోస్ లో ఒకడైన విజయ్ దేవరకొండ “లైగర్” సినిమాకి భారీ హైప్ పాన్ ఇండియా లెవెల్లో రాగ
దీని తర్వాత అయితే పాన్ రేంజ్ లో ఆసక్తి రేపింది మాత్రం అఖిల్ అక్కినేని నటిస్తున్న “ఏజెంట్” సినిమానే అని చెప్పాలి.
ఈ సినిమాను అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో చాలా మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పైగా మన తెలుగులో అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చినా మాసివ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనే లెవెల్లో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ అవైటెడ్ గా ఉండగా ఈ కొత్త ఏడాది కానుకగా అయితే చిత్ర యూనిట్ ఓ సాలీడ్ మేకింగ్ వీడియో వదిలి మరిన్ని అంచనాలు పెంచారు.
చిత్రంలో భారీ ఏక్షన్ సీక్వెన్స్ షూట్ పై చూపించిన విజువల్స్ అన్నీ ఏదో హాలీవుడ్ లెవెల్ సినిమాల దీనిని చూపిస్తున్నాయి.
అంతే కాకుండా ఈ ఒక్క సీక్వెన్స్ లో అయితే అఖిల్ ఓ తుఫాన్ లా దూసుకెళ్తున్నట్టు కనిపించిన సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలా ఈ లేటెస్ట్ వీడియో అయితే సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.
అని చెప్పొచ్చు. ఇక సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.
ఈ సినిమాకి ధృవ ఫేమ్ హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.