భారీ ధరకి “ఏజెంట్” హక్కులు ఊహించని సంస్థకి.!

 ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు ఉన్న సినిమా

 అఖిల్ అక్కినేని హాలీవుడ్ లెవెల్ యాక్షన్ అండ్ స్పై చిత్రం “ఏజెంట్” కూడా ఒకటి.

 దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికి షూటింగ్ దశలో ఉంది.

 అయితే ఈ సినిమా పై ఇక నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై సినీ వర్గాల్లో తెలుస్తుంది.

 ఈ సినిమా ఓటిటి హక్కులని ఊహించని సంస్థే కొన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ప్రైమ్ వీడియో కాదు నెట్ ఫ్లిక్స్ కాదు మరో సంస్థ సోని లివ్ వారు కొనుగోలు చేశారట.

 దీనితో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అనేది ఈ యాప్ లో ఉంటుంది అని చెప్పాలి.

 ఒకవేళ హిట్ అయితే ఈ సినిమాని 8 వారాల తర్వాతే రావచ్చని చెప్పాలి. లేకపోతే నాలుగు వారాల్లోనే వచ్చేస్తుంది అని చెప్పాలి.

 కాగా ఈ సినిమాకి భారీ ధరనే వారు అందించినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

 ఇక ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా అనిల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు.

 అలాగే ఈ సినిమాకి అఖిల్ కెరీర్ లోనే భారీ మొత్తంలో బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ 28న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.