గత ఏడాది పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో కన్నడ నుంచి వచ్చి భారీ హిట్ గా నిలిచిన సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” ఒకటి.
రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచి ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
అయితే ఈ రెండు సినిమాల తర్వాత యష్ చేసే సినిమాలపై చాలా రూమర్స్ వచ్చాయి.
ముఖ్యంగా ఏ దర్శకునితో చేస్తాడు అనేవి ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈరోజు తన పుట్టినరోజు కానుకగా తా కెరీర్ 19వ సినిమా అనౌన్స్ చేసేసారు.
అయితే ఈ సినిమాని కూడా కన్నడ ఇండస్ట్రీ కి చెందిన భారీ సినిమాల నిర్మాణ సంస్థల్లో ఒకటైన కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్ తో అయితే యష్ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు కన్ఫర్మ్ అయ్యిపోయింది.
మరి ఈ సినిమా కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే చేయనున్నారట అయితే దీనిపై దర్శకుడు ఎవరు ఇతర వివరాలు రివీల్ చేయలేదు
కానీ ఫైనల్ గా అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ మాసివ్ అప్డేట్ ఈరోజు వచ్చేసింది.
ప్రస్తుతం అయితే నిర్మాతతో యష్ లేటెస్ట్ పిక్స్ కూడా కొన్ని వైరల్ గా మారాయి.