మొత్తానికి ఆ భారీ సినిమాలో జాయిన్ అయ్యిన కాజల్.!

 టాలీవుడ్ సహా తమిళ నాట కూడా భారీ స్టార్డం ఉన్న హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.

 లాక్ డౌన్ లో కాజల్ పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేయడం తో సినిమాలకి అయితే దూరం అయ్యింది.

 అలాగే ఆ సమయంలోనే ఆమె చేసిన సినిమాలు కూడా మధ్యలో ఆమె పాత్రలు నిలిచిపోయాయి.

 కాగా ఈ లిస్ట్ లో కాజల్ హీరోయిన్ గా చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా తమిళ్ నుంచి ఒకటి ఉంది.

 ఆ సినిమానే “ఇండియన్ 2”. ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన

 ఈ మాసివ్ చిత్రం భారీ బడ్జెట్ తో గత ఇండియన్ 1 సినిమాకి సీక్వెల్ గా వస్తుంది. 

 ఈ సినిమా షూటింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేయగా ఫైనల్ గా ఈ షూటింగ్ లో కాజల్ మళ్ళీ అడుగు పెట్టినట్టుగా ఇప్పుడు తమిళ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశారు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మన ఏపీ లోనే జరుగుతూ ఉండగా కమల్ హాసన్ కూడా ఈ షూట్ లో ఉన్నారు.

 ప్రస్తుతం శంకర్ కాజల్ మరియు కమల్ పై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఇలా ఫైనల్ గా అయితే ఈ గ్లామరస్ బ్యూటీ ఈ భారీ సినిమాలో ఎంటర్ అయ్యింది.

 ఇంకా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తూ ఉండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు

 అలాగే అక్కడి భారీ సినిమాల నిర్మాణ సంస్థ లైకా వారు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.