ఆమె చాలా మంచి పెర్ఫామర్.. అంతకు మించి, చాలా మంచి డాన్సర్ కూడా.!
కానీ, ఎందుకో ‘విరాట పర్వం’ సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏదీ సందడి చేయడంలేదు.
అహో సాయి పల్లవి.. అని కీర్తించినవారు ఇప్పుడు సైలెంటయ్యారు.
ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.. ఓ యంగ్ బ్యానర్.. సాయి పల్లవితో రిస్క్ చేయడానికి రెడీ అయ్యిందనేది తాజా ఖబర్.
అసలు విషయమేంటంటే, సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ని డిజైన్ చేస్తున్నారట. స్మాల్ బడ్జెట్ సినిమా కాదు, మీడియం..
ఆ పైన అట.! అక్కడే వస్తోంది అసలు సమస్య అంతా. సాయి పల్లవి మీద, ఏమాత్రం ఎక్కువ ఖర్చు చేసినా రిస్కీ ప్రాజెక్ట్ అయిపోతుంది.
ప్రస్తుతానికి వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వస్తుందట.
ఓ మలయాళ సినిమా కోసం స్థానిక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది సాయి పల్లవి. అదే బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పుడు సినిమా చేయబోతున్నారట.