ప్రతి ఒక్కరూ తమకు ఎంతో అందమైన భార్య మాత్రమే కాకుండా మంచి మనసు మంచి గుణం ఉండే భార్య కావాలని కోరుకుంటారు.
అయితే మన జీవిత భాగస్వామిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు.
చాణిక్య నీతి శాస్త్రం ప్రకారం భార్యలో ఉండాల్సిన లక్షణాల గురించి వివరించారు. ఏ మహిళలు అయితే ఇలాంటి లక్షణాలు కనుక ఉంటాయో
ఓ గొప్ప భార్య అని చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలిపారు. చాణిక్య నీతి శాస్త్రం ప్రకారం ఒక భార్య తన భర్తను ఎప్పుడూ ఓ తల్లి లాగా చూసుకోవాలని
ముఖ్యంగా భర్తకు భోజనం వడ్డించే సమయంలో ఈ లక్షణాలు ఉండాలని తెలిపారు. ఇక కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భార్య నడుచుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఏ మహిళ అయితే కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారో ఆమె ఓ గొప్ప భార్య అంటూ చాణిక్యడు తెలిపారు.
ఇక భర్త దగ్గర భార్య ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. ఇలా తెలివిగల ఎంతో నీతివంతురాలైన అమ్మాయి భార్యగా దొరకడం గొప్ప అదృష్టం.
భార్య అంటే కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు అందమైన మనసు ఉన్నప్పుడే ఆ భార్య మరింత అందంగా ఉంటుందని ఆ కుటుంబం కూడా చాలా సంతోషంగాఉంటుందని
ఓ గొప్ప భార్యకు ఉండాల్సిన లక్షణాలు ఇవేనని చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలియజేశారు.