శ్రీముఖితో చిరు ట్రెండ్ సెట్టింగ్ సీన్..? 

 టాలీవుడ్ లో ఉన్న హీరోస్ లో అన్ని కోణాల్లో కూడ సూపర్ గా ఎంటర్టైన్ చేసే హీరోలు అతి తక్కువ మందే ఉంటారు మరి అలాంటి హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.

 కామెడీ కి కామెడీ మాస్ కి మాస్ డాన్స్ కి డాన్స్ ఇలా అన్నిటిలో కూడా మెగాస్టార్ ది స్పెషల్ ప్లేస్ అందుకు తనకి ఇండస్ట్రీ లో సుస్థిర స్థానం ఉంది.

 మరి లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య లో కూడా ఎప్పుడు నుంచో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆ కామెడీ టైమింగ్ ని మళ్ళీ చూపించారు.

 అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి హిట్ కూడా అయిపోయింది. కాగా ఇక ఇప్పుడు అయితే నెక్స్ట్ భోళా శంకర్ వంతు అట.

 దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ మన తెలుగులో అనేక మార్పులు చేశారు.

 మరి ఇప్పుడు ఈ సినిమాపై ఓ క్రేజీ గాసిప్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమాలో యంగ్ అండ్ హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఓ రోల్ లో కనిపించనుండగా

 మెగాస్టార్ మరియు శ్రీముఖి మధ్య ఓ ఐకానిక్ సీన్ ని రీ క్రియేట్ చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

 మరి ఆ సీన్ కూడా ఏదో కాదు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి లో ఇంటర్వెల్ నడుము సీన్ అట.

 ఇది ఒకింత ఆశ్చర్యంగా ఉంది కానీ చిరు మరియు శ్రీముఖి ల మధ్య ఈ సీన్ ని మళ్ళీ కామెడీ గా ప్లాన్ చేసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

 మరి ఏవేవో అయితే ప్లాన్ లు మేకర్స్ చేస్తున్నారు, ఈ అనవసర క్రియేటివిటీ తో సినిమా అయితే దెబ్బ కొట్టకుండా ఉంటే అదే పదివేలు.