దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా తమ పనులు చేస్తున్నారు.
ఇదే అదనగా సైబర్ నేర గాల్లో కూడా అందరిని మోసం చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటువంటిది మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది.
కెమెరా అద్దె కి తీసుకువెళ్లి అద్దె చెల్లించకపోగా తిరిగి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఖానాపూర్ లో వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే…ఖానాపూర్ పట్టణానికి చెందిన జంగాల సాయి మస్కాపూర్ శివారులో అద్దెకుబుంటి డిజిటల్ కెమెరాలు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే దీన్ని ఆసరాగా తీసుకొన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రోజుల క్రితం సాయికి ఫోన్ చేసి, తనది మామడ మండలమని, తనపేరు అఖిల్ అని పరిచయం చేసుకొన్నాడు.
తాను గతంలో మీ దగ్గర కెమెరా అద్దెకు తీసుకొన్నానని ఓ రెండు రోజులు కెమెరా అద్దెకు కావాలని సాయి ని నమ్మించి కెమెరా అద్దెకు తీసుకున్నాడు.
ఈ మేరకు ఈ నెల 24న మస్కాపూర్ వచ్చి రూ.1.10 లక్షల విలువైన కెమెరా తీసుకెళ్లాడు.
రెండు రోజుల తర్వాత సాయి తన కెమెరా తిరిగి ఇవ్వాలని కోరగా తనకు రూ.50వేలు ఇస్తేనే తిరిగి ఇస్తానని, దానికి సంబంధించి డబ్బులు తాను పంపిన స్కానర్‌కు పంపించాలని డిమాండ్ చేశారు.
కాకుండా తనకు సంబంధించిన ఫోన్ నెంబర్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు వంటి ఆధారాలు తనకోసం తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దని సాయిని బెదిరిస్తూ.. వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ 50 వేల రూపాయలు డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో తాను మోసపోయారని తెలుసుకున్న సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సదరు నిందితుడు ఒక ప్రైవేటు నెంబర్ నుండి చాటింగ్ చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. తొందర్లోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరగటం వల్ల ప్రజలందరూ అప్రమంతంగా ఉండాలని.. ఇటువంటి ఆధారాలు లేనిదే ఇతర వ్యక్తిని నమ్మకూడదని ప్రజలకు సూచిస్తున్నారు.