కొన్ని సినిమాలు పండుగ సీజన్లో వస్తున్నాయి అంటే ఒక రోజు గ్యాప్ వచ్చినా కూడా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక ఇది మన స్టార్ హీరోల సినిమాలు అయితే మరో లెవెల్లో ఉంటుంది. అయితే టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య చిరు లు ఒక రోజు గ్యాప్ లో వస్తున్నారు
కానీ తమిళ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఇప్పుడు భారీ క్లాష్ కి తెరపడింది. గత కొన్ని రోజులు నుంచి అజిత్ కుమార్ నటించిన తూనీవు అలాగే
విజయ్ నటించిన చిత్రం వరిసు లు రిలీజ్ డేట్ లు ఇవ్వకుండా ఊరిస్తూ వస్తున్నాయి.
మరి ఫైనల్ గా నిన్న అయితే ఈ రెండు సినిమాలు అప్డేట్స్ వచ్చేసాయి. దీనితో ఈ జనవరి 11నే రెండు సినిమాలు రిలీజ్ కావడం క్రేజీ గా మారింది.
మొదట ఓ రోజు గ్యాప్ లో రావచ్చని బజ్ ఉంది కానీ తర్వాత ఓకే రోజు ఉండొచ్చని టాక్ వచ్చింది.
కానీ ఫైనల్ గా అయితే మొదట తూనీవు రిలీజ్ డేట్ జనవరి 11 అని ఫిక్స్ చేయగా నెక్స్ట్ వరిసు డేట్ ని కూడా ఇదే రోజుకి ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేశారు.
దీనితో ఇద్దరు మధ్య భారీ క్లాష్ కన్ఫర్మ్ అయ్యింది. మరి మొత్తం 9 ఏళ్ళు తర్వాత అజిత్ మరియు విజయ్ ల మధ్య సంక్రాంతి క్లాష్ జరుగుతుందట.
గత 9 ఏళ్ల కితం అయితే అజిత్ “వీరమ్” అలాగే విజయ్ “జిల్లా” చిత్రాలు రిలీజ్ కాగా ఇపుడు మళ్ళీ వచ్చిన ఈ భారీ యుద్ధం తమిళ సినీ వర్గాల్లో హీట్ పెంచింది.