1000 కోట్ల “పఠాన్”..కొత్త రికార్డ్స్ ఇవేనట.!

 ఒకప్పుడు లాంగ్ రన్ సినిమాలు అంటే అన్ని భాషల్లో ఉండేవి కానీ ట్రెండ్ మారినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం లాంగ్ రన్ ఇప్పటికీ ఉంది.

 అక్కడ సినిమా నచ్చితే చాలా వరకు కూడా భారీ ఎత్తున లాంగ్ రన్ సినిమాలు నడుస్తూ ఉంటాయి.

 కానీ ఒక్కసారిగా హిందీ సినిమా ఫెయిల్ అయ్యింది. తమ రేంజ్ హిట్ లు లేక షాకింగ్ లెవెల్లో పాతాళానికి పడిపోయింది.

 మరి సరిగ్గా అప్పుడే వచ్చిన చిత్రం “పఠాన్”. బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా తాను కూడా అప్పటికే ప్లాప్స్ లో ఉన్నాడు.

 నాలుగేళ్లు అయిపోయింది. బాలీవుడ్ నుంచి సరైన బాక్సాఫీస్ హిట్ లేదు ఆ సమయంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ రికార్డుల దుమ్ము దులిపేసింది.

 మొదటి రోజే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు సెట్ చేసిన ఈ సినిమా నిన్నటితో అయితే ఏకంగా 1000 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకుని మరో చరిత్ర సృష్టించింది.

 కాగా ఇప్పుడు ఈ గ్రాస్ తో అయితే హిందీలో పలు రికార్డులు పఠాన్ సెట్ చేసింది అట.అసలు బాలీవుడ్ హిస్టరీ లోనే ఏడాది మొదటి నెలలో

 ఓ సినిమా రిలీజ్ అయ్యి 1000 కోట్లు మార్క్ అందుకోవడం మొట్ట మొదటిసారిగా పఠాన్ తోనే జరిగింది అని అలాగే హిందీ మార్కెట్ నుంచి కూడా 1000 కోట్లు

 అందుకున్న ఫాస్టెస్ట్ సినిమాగా కూడా పఠాన్ నిలిచింది అని అంటున్నారు.అంతే కాకుండా హిందీలో దంగల్ సినిమా తర్వాత

 చైనా రిలీస్ కాకుండా 1000 కోట్లు అందుకున్న సినిమాగా పఠాన్ నిలవగా బి టౌన్ లో సెన్సేషనల్ గ్రాసర్ గా ఉన్న

 బాహుబలి 2 లైఫ్ టైం వసూళ్ళని కూడా బ్రేక్ చేసే మొదటి సినిమాగా పఠాన్ నిలుస్తుంది అని ట్రేడ్ అంటున్నారు.

 దీనితో ఈ రకంగా ఈ బిగ్గెస్ట్ హిట్ బాలీవుడ్ లో ఓ రిమార్కబుల్ రన్ ని అందుకుంది అని చెప్పాలి.