100 కోట్ల క్లబ్ కి తృటిలో “ధమాకా”.!

గత ఏడాది టాలీవుడ్ లో వచ్చినన్ని మాసివ్ హిట్ లు అలాగే వచ్చిన డిజాస్టర్ లు కూడా ఎప్పుడూ రాలేదు.

వచ్చిన సినిమాలు అయితే భారీ ఎత్తున లాభాలు లేకపోతె భారీ ఎత్తున నష్టాలు ఇచ్చాయి.

మరి ఇప్పుడు ఫైనల్ గా డిసెంబర్ లో వచ్చి భారీ లాభాలు ముట్టజెప్పిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ రవితేజ నటించిన ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా” అనే చెప్పి తీరాలి.

ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ వర్గాలకి షాకిస్తూ 10, 11 రోజులలో దుమ్ము లేపాయి. మరి 11 రోజుల్లో 96 కోట్లకి చేరిన ఈ సినిమా వసూళ్లు ఫైనల్ గా 12 వ రోజుకి గాను 96 కోట్ల మార్క్ క్రాస్ చేసి బిగ్గెస్ట్ సెన్సేషన్ ని రేపింది.

అయితే ఈ పన్నెండవ రోజుకే ఎలా లేదన్నా 100 కోట్లు ఈ సినిమా కొట్టేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వారు అనుకున్నారు కానీ సినిమా కొంచెం స్లో అయ్యింది.

మరి ఈరోజుతో అయితే ఈ సినిమా మాసివ్ మార్క్ అందుకునే ఛాన్స్ ఉంది. ఈ చిత్రం అయితే రవితేజ కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచి గట్టి కం బ్యాక్ ని అందించింది.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా రావు రమేష్ తదితరులు నటించారు.

అలాగే త్రినాధరావు నక్కిన ఈ సినిమాని దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు అలాగే భీమ్స్ సంగీతం అందించాడు.