fbpx
Home Cinema రెండుగంటల హైపర్ థ్రిల్లర్! (‘కిల్లర్’)

రెండుగంటల హైపర్ థ్రిల్లర్! (‘కిల్లర్’)

తెలుగులో తమిళ విజయ్ అంటోనీ తాజా మూవీ ‘కిల్లర్’ ట్రైలర్ తో ఒక ఆసక్తిని, సస్పెన్స్ నీ రేకెత్తించిన విషయం తెలిసిందే. తీరా ఆ ట్రైలర్ కి, సినిమాకీ సంబంధం లేదని తెలిస్తే ట్రైలర్ రూపొందించిన దర్శకుడి మీద చిన్నచూపు ఏర్పడే అవకాశముంది. సినిమాలో మంచి కంటెంట్ వున్నాక ట్రైలర్ తో మిస్ లీడ్ చేయాల్సిన అవసరమేమిటో తెలీదు. ట్రైలర్ తో ఇది మరో రొటీన్ సైకో కిల్లర్ కథ అన్నట్టు అభిప్రాయం కల్గించారు. మళ్ళీ సైకో కిల్లర్ ని ఏం చూస్తామని ప్రేక్షకులు ఆగిపోతే ఆ ట్రైలర్ సినిమాకి మైనస్సే అవుతుంది. కానీ ట్రైలర్ లో మిస్ లీడ్ చేసిన విషయం కంటే స్ట్రాంగ్ కంటెంట్ సినిమాలో వుంది. ఇప్పటికైనా ట్రైలర్ ని సినిమాలో కంటెంట్ ప్రకారం మార్చి రిలీజ్ చేస్తే సినిమాకి ప్లస్ అయ్యే అవకాశముంది. ఇంతకీ సినిమాలో వున్న స్ట్రాంగ్ కంటెంట్ ఏమిటి? ఇదొకసారి చూద్దాం…

కథ

ఒక యువతి హత్యతో ప్రారంభమవుతుంది. ఈ యువతిలాగే వున్న ఇంకో యువతి జయంతి (ఆషిమా నర్వాల్) కథలోకి ప్రవేశిస్తుంది. దీనికంటే ముందు, ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ) అనే అతను పోలీసులకి లొంగిపోయి ఈ హత్య తనే చేశానంటాడు. ఏ హత్య? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కార్తికేయ (అర్జున్) దృక్కోణంలో కొన్ని రోజులు వెనక జరిగిన ఒక హత్య తెర పైకి వస్తుంది. ఆ సగం సగం కాలిన గుర్తు తెలియని శవం వంశీ దని గుర్తిస్తాడు. వంశీ ఏపీ మంత్రి తమ్ముడు. ఇతన్ని తను చంపానంటాడు ప్రభాకర్. కార్తికేయ నమ్మడు. ఇతన్ని జయంతీ, ఆమె తల్లీ (సీత) కలిసి చంపి వుండాలని గట్టి అనుమానం.

ఇందుకు మోటివ్ కూడా దొరుకుతుంది. వంశీ జయంతిని పెళ్లి చేసుకొమ్మని గత రెండేళ్లుగా సైకోలా వెంట పడి వేధిస్తున్నాడు. ఇందుకే చంపేశారని కార్తీక్ అనుమానం. కాదు, వాళ్ళ ఎదుటి ఫ్లాట్ లో వున్న తనే చంపానని ప్రభాకర్ వాదన. ఏమిటీ మిస్టరీ? ఎవరు చంపారు? చంపి వుంటే ఎవరు ఎవర్ని చంపారు? మొదట చూపించిన హత్యకి గురైన ఆ యువతి ఎవరు? ఆమెని ఎవరు చంపారు? ఈ రెండు హత్యలేనా, తెలియకుండా మూడో హత్య మిస్టరీ కూడా వుందా? అసలు ప్రభాకర్ ఎవరు? ఎందుకు హత్యని క్లెయిమ్ చేస్తున్నాడు? జయంతీ తనూ ప్రేమించుకోనే లేదు. కానీ ఆమె కోసం ఎన్ని హత్యలైనా చేస్తానని ఎందుకంటున్నాడు? ఇదీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కార్తికేయ ముందున్న కొరకరాని కొయ్యలా తయారైన కేసు…

 

ఎలావుంది కథ

ట్రైలర్ లో చూపించినట్టు సైకో కిల్లర్ కథ కాదు. హీరోకున్న ఒక బాధాకర గతం, దాంతో హత్యలో ఇరుక్కున్న తల్లీ కూతుళ్ళని కాపాడేందుకు ఆ గతాన్నే ఎరగా వేసి మానవత్వాన్ని చాటునే ఆ హీరో కథే ఇది. ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే ఇలాటి డార్క్ మూవీస్ చెయ్యడు ఆంటోనీ. ఈ కథని జపనీస్ నవల ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ నుంచి పాయింటు మాత్రమే తీసుకుని చేశానన్నాడు దర్శకుడు ఆండ్రూ లూయిస్. జరిగిన ఒక హత్యని హీరో కవర్ చేయడమనే పాయింటు. ఈ పాయింటుకి పకడ్బందీ కథనం చేశాడు. లాజికల్ గా ఎక్కడా ప్రశ్నలు వదలకుండా స్క్రీన్ ప్లే నిర్వహించాడు. అయితే ఒక మౌలిక ప్రశ్న వుండిపోయింది. రెండేళ్లుగా ఆ తల్లీ కూతుళ్ళని వేధిస్తూంటే పోలీస్ కంప్లెయింట్ ఎందుకివ్వ లేదు? మంత్రి తమ్ముడనా? దీనికి స్పష్టత నివ్వలేదు.

ఎవరెలా చేశారు ?

ఆంటోనీ పూర్తిగా లో ప్రొఫైల్ క్యారెక్టర్ లో కన్పిస్తాడు. పాత్ర గతాన్ని బట్టి ఇలా కన్పిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో రోమాన్స్, పాటలూ వుంటాయి. ఇవి నీటుగా వుంటాయి. నటన పోతున్నకొద్దీ చిక్కనవుతూ, చివరి సన్నివేశాల్లో అసలు విషయాలు చెప్పినప్పుడు సానుభూతి నంతా రాబట్టుకుని, పాత్రకి ఔన్నత్యాన్ని కల్పిస్తాడు. ఈ ముగింపే ఈ హత్యల నార్మల్ కథకి ప్రేక్షకులతో గట్టి బాండింగ్ నేర్పరుస్తుంది.
ఆషిమా నర్వాల్ రెండు పాత్రల్లో నీటుగా నటించింది. తను చేసిన పనికి నింద అతను మీదేసుకుంటే పడే మానసిక సంఘర్షణ ఆమెకి హైలైట్ సన్నివేశం. ఇంతకీ అతను తనకేమీ కాడు. ఇదింకో ఎమోషనల్ బ్యాగేజీ. ఇక తల్లి పాత్రలో సీత కూడా ఎక్సెలెంట్. అసలు హత్యా దృశ్యంలో వీళ్ళిద్దరి నటనే ఒక ఎట్రాక్షన్ సినిమాకి.

పోలీసాఫీసర్ గా ఎక్కడా ఒక చిన్న స్మైల్ కూడా ఇచ్చుకోని సినిక్ లా వుండే పాత్రలో అర్జున్ ఇంకో బలం ఈ సినిమాకి. కథని ఇతనితోనే ఫాలో అవుతూంటాం. తను ముప్పు తిప్పలు పడి, మనల్ని ముప్పు తిప్పలు పెట్టేస్తాడు. ఇతడికి లాజిక్ పాఠాలు చెప్తూ మెలిదిప్పే పై ఆఫీసర్ పాత్రలో నాజర్ ఓ పక్క.
నటులు, నటనలు రెండు గంటల ఒక బలమైన ఈ థ్రిల్లర్ డ్రామా సృష్టించాక, చెప్పుకోవాల్సింది టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగ్, కలర్ థీమ్. బిజిఎం ఇంకో ప్లస్ కాగా, రెండు డ్యూయెట్లు రిలీఫ్ నిస్తాయి. మొదటి డ్యూయెట్ ప్రారంభంలో ఐదు నిమిషాలకే వచ్చేస్తుంది.
కొత్త దర్శకుడు ఆండ్రూ లూయిస్ కొత్త దర్శకుడిలా అన్పించడు.

చివరికేమిటి

అనేక ఫ్లాష్ బ్యాక్స్, ఫ్లాష్ ఫార్వర్డ్స్ తో వుండే కాంప్లికేటెడ్ కంటెంట్. దీన్ని గజిబిజి చేసి అభాసు అవకుండా అర్ధమయ్యేలా క్లియర్ చేసుకుంటూ కథ చెప్పుకు పోయాడు. ఈ కథ ఎండ్స్ సస్పెన్స్ గండంలో పడే వైపు వెళ్తోందని ఇంటర్వెల్ కల్లా అన్పిస్తుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత పదిహేను నిమిషాల కల్లా ఎండ్ సస్పెన్స్ ని తీర్చేసి, సీన్ టు సీన్ సస్పెన్స్ చేసుకుంటూ పోవడంతో బతికింది సినిమా.
ఇక చిట్ట చివర్లో వుంటుందని అస్సలూహించని సస్పన్స్ బయట పడడం మాస్టర్ స్ట్రోక్. ఇది హీరో గతంతో. అప్పుడు ఇక్కడే మొదలైన కథ ఇదంతా అని అర్ధమవుతుంది. ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో డెంజిల్ వాషింగ్టన్ చివర్లో విలన్ కి తన గతాన్ని రివీల్ చేసి, పాత్రని ఎక్కడికో తీసికెళ్ళి పోయినట్టుగా.
ఐతే ఈ పోలీస్ ప్రొసీజురాల్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో పానకంలో పుడకలా ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ లో అకస్మాత్తుగా విజయ్ అంటోనీ ఐపీఎస్ ఆఫీసర్ గా రివీల్ అయి, రౌడీల్ని తరుముతూంటాడు. తరుముతూంటే – ‘ధైర్యం నీ వెనుకా, సైన్యం నీ లెక్కా’ – అంటూ మసాలా సాంగ్ రావడం! ఎలాటి కథ ఎలా అయిపోయిందన్పిస్తుంది!
ఈ పానకంలో పుడక ఇంటర్వెల్ తప్పితే, మిగతా సెకండాఫ్ దారిలో పడుతుంది జానర్. రెండు గంటల సేపు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి చూసేలా చేసే ఈ సస్పెన్స్ థ్రిల్లర్, తమిళం నుంచి వచ్చిన ఒక బాక్సాఫీసు సక్సెస్ స్టోరీ.

రచన – దర్శకత్వం : ఆండ్రూ లూయిస్
తారాగణం : విజయ్ ఆంటోనీ, అర్జున్, ఆషిమా నర్వాల్, నాజర్, సీత తదితరులు
సంగీతం : సైమన్ కింగ్, ఛాయాగ్రహణం : ముఖేష్
నిర్మాత : అంజయ్య
విడుదల : జూన్ 7, 2019
Rating: 3 / 5

—―సికిందర్

తెలుగురాజ్యం ప్రత్యేకం

రాయలసీమలో తెలుగుదేశంని ముందుండి నడిపే రెడ్డి ఎవరు?

37 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయిన టీడీపీ ఇకపై ఎలా ప్రస్థానం కొనసాగిస్తుందోనన్న...

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్? తెలంగాణ ప్రాంత వాసుల సుదీర్ఘ కల తెలంగాణ రాష్ట్రం. అది 2004 సంవత్సరంలో సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? కెసిఆర్ పోరాటం వలన? లేక కాంగ్రెస్ ఇచ్చిందా??...

మల్టిపుల్ తికమక- ‘గేమ్ ఓవర్’ రివ్యూ

ఈ రెండేళ్లుగా ముల్క్, నీవెవరో, మన్మర్జియా, బద్లా అనే రియలిస్టిక్ సినిమాల్లో మరిన్ని బలమైన పాత్రలు నటించిన తాప్సీ సోలో ప్రయాణం, 2016 లో ‘పింక్’ తో ప్రారంభమయ్యింది. మళ్ళీ ‘పింక్’ లాంటి...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

సీక్రెట్ గా మర్డర్స్ తో శృతిహాసన్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు

ఇన్నాళ్లూ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో నటిగా సందడి చేసిన శృతిహాసన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు. అమెరికాకు చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శ్రుతి కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇందులో ఆమె వెయిట్రెస్‌గా కనిపిస్తూ సీక్రెట్...

రానా ‘విరాటపర్వం’లీకైన స్టోరీ..ఇంట్రస్టింగ్

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా పొలిటికల్ థ్రిల్లర్ విరాటపర్వం సినిమా మొదలైన సంగతి తెలిసిందే. నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న...

రెజీనా కి సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమిటో

స్టార్ హీరోయిన్ రెజీనా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ నేషనల్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ రెజీనా నిశ్చితార్థం గురించి వార్తలు ప్రచురించడం వైరల్‌గా మారింది. ఈ...

తెలుగు టీవి సీరియల్ నటిపై మూకుమ్మడి దాడి

గొలుసు విషయంలో తలెత్తిన ఓ వివాదం టీవీ సీరియల్ నటిపై మూకుమ్మడి దాడికి కారణమైంది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్‌ డ్రెసర్‌ జ్యోతిక తన అనుచరులతో...

మూడో ఎంఎల్సీ వైసిపిలో ఎవరికో ?

తొందరలో భర్తీ అయ్యే మూడు ఎంఎల్సీల్లో మూడో అవకాశం ఎవరికి వస్తుందో అన్న సస్పెన్స్ పెరిగిపోతోంది.  మొన్నటి ఎన్నికల్లో ఐదు ఎంఎల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. ఇందులో రెండు స్ధానిక సంస్ధలకు చెందినవైతే...

షాకింగ్ : ‘సాహో’ ప్రి రిలీజ్ బిజినెస్

ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రీ బిజినెస్ కూడ ఊపందుకుంది. దాదాపు ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు...

అచ్చెన్నకు గట్టి షాక్ ఇచ్చిన స్పీకర్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ గట్టి షాకే ఇచ్చారు. ప్రత్యేకహోదా అంశంపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నపుడు పదే పదే అచ్చెన్న అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా స్పీకర్ నే...

స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేస్తున్న శేఖర్ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయటం చాలా మంది అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ లో గుర్తింపు వస్తుంది. మినిమం సెన్సిబులిటీస్ తో సినిమా చేస్తారు. రీసెంట్ గా...

చంద్రబాబుకు షాకులిస్తున్న సుజనా

చంద్రబాబునాయుడుకు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి షాకులిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత బహిరంగంగా చంద్రబాబును తప్పు పట్టిన నేతలు ఎవ్వరూ లేరు. అలాంటిది సుజనా మాత్రం...

బిజెపిలో చేరిన మాజీ ఎంపి..ఎంత కాలం ఉంటారో ?

రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు కొత్తా గీతతో మొదలైనట్లుంది. అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు కొత్తా గీత బిజెపిలో చేరారు. కేంద్ర హోం శాఖమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా...
 Nate Gerry Jersey