Home Entertainment Tollywood ఏంరో, నన్ను సూస్తివా?- వరుణ్ తేజ్ 'వాల్మీకి' మూవీ ట్రైలర్ రివ్యూ!

ఏంరో, నన్ను సూస్తివా?- వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మూవీ ట్రైలర్ రివ్యూ!

ఏంరో, నన్ను సూస్తివా? – వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మూవీ ట్రైలర్ రివ్యూ!

గుబురు గడ్డం పెంచుకుని, మాస్ లుక్ తో భయంకర బందిపోటులా వున్నవరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ట్రైలర్ ఫుల్ రేంజి యాక్షన్ థ్రిల్లర్ ని ప్రేక్షకుల ముందు వుంచుతోంది… వరుణ్ తేజ్ ఉగ్రరూపం, కసి రేగే డైలాగులు, రక్తాలు కారే పోరాటాలు ట్రైలర్ ని అలంకరించాయి. ‘నాపైన పందేలు వేస్తే గెలుస్తరు, నాతోటి పందేలేస్తే చస్తరు. గద్దల కొండ గణేష్‌ అంటే గజ గజ గజ వణకాలి’ అంటూ తెలంగాణా డైలాగులతో చెలరేగిపోయాడు వరుణ్. తనని ఇలాటి రఫ్ నెగెటివ్ గెటప్ లో రాక్షసంగా చూడడం ఇదే తొలిసారి. ఈ గెటప్ లో తేలిపోకుండా తన పవరేంటో విజృంభించి ప్రదర్శించాడు. ‘ఏంరో, మనం బతుకున్నమని పదిమందికి తెల్వకపోతే, మనం బతుకుడెందుకురా?’ అని మెత్త మెత్తగానూ ప్రశ్నిస్తున్నాడు.

కథేమిటో కూడా ఈ ట్రైలర్ లో చెప్పేశారు – ఫామ్ హౌస్‌లో వున్న డాన్‌ ని కాదు, ఫామ్‌లో వున్న డాన్‌ని పట్టుకునే కథే ఈ వాల్మీకి అంటూ…ఓ మంచి సినిమా తీయాలనుకునే యువ దర్శకుడు ‘వాల్మీకి’ ని ఎలా చూపించాడన్నదే ఈ సినిమా నేపథ్యమంటున్నారు. కరుడుగట్టిన డాన్ నుంచీ సినీ రచయితగా మారిన మనిషి పాత్ర వరుణ్ తేజ్ ది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో పీరియడ్ లుక్ తో దృశ్యాలు కూడా వున్నాయి – ‘గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పీ లహరి పాట కొట్టుడు, నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేమ్ టు సేమ్’ అని పూజా హెగ్డే తో లవ్ ట్రాక్ వుంది.

తమిళ ‘జిగర్తాండా’ ని హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తర్వత హరీష్ చేస్తున్న మూవీ ఇది. ఛోటా కె ప్రసాద్ ఛాయాగ్రహణం, మిక్కే జె మేయర్ సంగీతం నిర్వహిస్తున్న ఈ మాస్ యాఆక్షన్ లో పూజ హెగ్డే తో బాటు అథర్వ మురళి, మృణాళిని, రవి నటిస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

మంచు మ‌నోజ్‌కి మండేలా చేసిందెవ‌రు?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగ‌మే. దీని భారీ ఉంచి భ‌య‌ట‌ప‌డాలంటే నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని, అంతా ఇంటి ప‌ట్టునే వుండాల‌ని దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించాయి....

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత కూడా....

ఆ ఇద్ద‌రికి అనిల్ రావిపూడి షాకిస్తున్నాడా?

`ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే ఇప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌రు. సింపుల్ లైన్‌తో, జ‌బ‌ర్ద‌స్ట్ కామెడీ స్కిట్‌ల‌ని త‌ల‌పించే సీన్‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇది సినిమానేనా? అని...

కీర్తి పెళ్లి వార్త‌ల సృష్టిక‌ర్త దొరికిపోయాడు!

సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రంతో హీరోయిన్ కీర్తి సురేష్ స్థాయే మారిపోయింది. ఈ సినిమాతో ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న కీర్తి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో...

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి...యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి...

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...