Home Movie Reviews Telugu Movie Reviews `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` రివ్యూ : మ్యాజిక్ చేయ‌ని రౌడీ

`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` రివ్యూ : మ్యాజిక్ చేయ‌ని రౌడీ

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశిఖ‌న్నా, ఐశ్వ‌ర్యారాజేష్, కేథ‌రిన్, ఇజ‌బెల్లా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌్రాంతి మాధ‌వ్‌
నిర్మాత‌లు: కె.ఎ. వ‌ల్ల‌భ‌, కె.ఎస్‌. రామారావు
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సినిమాటోగ్ర‌ఫి : జ‌య‌కృష్ణ గుమ్మ‌డి
ప్రొడ‌క్ష‌న్ కంపెనీ : క‌్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్స్‌
రిలీజ్ డేట్ : 14 – 02- 2020
రేటింగ్ :

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ వుంది. అత‌ని సినిమా వస్తోందంటే ఆ బ‌జ్ వేరుగా వుంటుంది. అయితే విజ‌య్ న‌టించిన తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రానికి ఆ బ‌జ్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. `డియ‌ర్ కామ్రేడ్‌` ఆశించిన స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది. దీంతో ఈ సినిమా అయినా ఆ లోటుని తీరుస్తుంద‌ని విజ‌య్ రౌడీ ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ల‌లో ప్ర‌తి ప్రెస్ మీట్‌లోనూ ఇదే నా చివ‌రి ల‌వ్‌స్టోరీ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌దే ప‌దే ఎందుకు చెప్పాడు? మూడు ప్రేమ‌క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రౌడీ హీరో త‌న‌దైన న‌ట‌న‌తో మ్యాజిక్ చేశాడా?. రిలీజ్‌కు ముందు బ‌జ్ క్రియేట్ చేయ‌ని ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ని అందుకుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

గౌత‌మ్ ( విజ‌య్ దేవ‌ర‌కొండ‌) చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి రైట‌ర్‌గా సెటిల్ అవ్వాల‌నుకుంటాడు. అందుకు త‌గ్గ ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు కానీ స‌క్సెస్ కాలేక‌పోతుంటాడు. ఈ క్ర‌మంలో ఫ్ర‌స్ట్రేష‌న్ పెరిగిపోతుంటుంది. యామిని ( రాశిఖ‌న్నా). గౌత‌మ్ తో స‌హ‌జీవ‌నం చేస్తూ వుంటుంది. కాలేజ్ ల‌వర్ కావ‌డంతో ఇద్ద‌రు ప్రేమ‌లో మునిగితేలుతుంటారు. కానీ గౌత‌మ్ ఫ్ర‌ష్టేష‌న్‌ని యామిని త‌ట్టుకోలేక‌పోతుంటుంది. ఈ క్ర‌మంలో అత‌నికి బ్రేక‌ప్ చెప్పేసి దూరంగా వెళ్లిపోతుంది. దీంతో గౌత‌మ్ మ‌రీ పిచ్చివాడైపోతాడు. ఈ స్ట్ర‌గుల్స్‌లోనే కొంత మంది స్ఫూర్తితో ఓ క‌థ రాయ‌డం మొద‌లుపెడ‌తాడు. ఇల్లందులోని బొగ్గు గ‌నిలో ప‌నిచేసే సీన‌య్య‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌), సువ‌ర్ణ (ఐశ్వ‌ర్యారాజేష్‌)కున్న సంబంధం ఏంటీ?.. వాళ్ల మ‌ధ్య‌కి స్మిత ( కేథ‌రిన్‌) ఎలా వ‌చ్చింది?.. అలాగే పారిస్‌లో వున్న గౌత‌మ్ ( విజ‌య్ దేవ‌ర‌కొండ‌), ఇజ (ఇజ‌బెల్లా)కు వున్న సంబంధం ఏంటి?. యామిని ప్రేమ కోసం త‌పించే గౌత‌మ్ చివ‌రికి ఆమె ప్రేమ‌ని గెలుచుకున్నాడా?. త‌ను కోరుకున్న‌ట్టుగానే ర‌చ‌యిత‌గా పేరు తెచ్చుకున్నాడా అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండనే ఈ చిత్రానికి మెయిన్ సేలింగ్ పాయింట్‌. అత‌ను ఈ సినిమాకి వ‌న్ మెన్ ఆర్మీ అని చెప్పొచ్చు. అత‌ని క్యారెక్ట‌ర్ ఇందులో టెర్రిఫిక్‌గా వుంది. అత‌ను లేక‌పోతే సినిమానే లేదు అనేంత‌గా న‌టించాడు. `అర్జున్‌రెడ్డి`లో 3 టు 4 వేరియేష‌న్స్‌ని చూపిస్తే ఇందులో మూడు వేరియేష‌న్స్‌తో విజ‌య్ పాత్ర సాగుతుంది. సీన‌య్య పాత్ర ఈ సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌చింది. ఈ పాత్ర‌కు విజ‌య్ యాక్సెంట్ మ‌రింత వ‌న్నె తెచ్చింది. గౌత‌మ్ పాత్ర‌లోనూ విజ‌య్ సిటీ గ‌య్‌గా అద్భుతంగా న‌టించాడు. అయితే అత‌ని ఎఫ‌ర్ట్ ద‌ర్శ‌కుడి త‌ప్ప‌దం కార‌ణంగా బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా మారింది. ఇలాంటి పాత్ర‌లు ఓ న‌టుడికి జీవిత కాలంలో ఒకే ఒక్క‌సారి ల‌భిస్తాయి. అలాంటి పాత్రలో న‌టించిన సినిమా లైఫ్ టైమ్ మెమొర‌బుల్‌గా వుండాల‌ని కోరుకుంటారు కానీ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఆ కోరిక‌ని, విజ‌య్ ఎఫ‌ర్ట్‌ని నీరుగార్చింద‌నే చెప్పాలి.

విజ‌య్ త‌రువాత అంత‌గా ఆక‌ట్టుకున్న పాత్ర సువ‌ర్ణ‌. ఈ పాత్ర‌లో ఐశ్వ‌ర్యారాజేష్ జీవించింది. సినిమా మొత్తానికి సీన‌య్య‌, సువ‌ర్ణ‌ల ట్రాక్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. భావోద్వేగా స‌న్నివేశాల్లో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌ట‌నకు ఎక్క‌డ వంక పెట్ట‌లేం. డీ గ్లామ‌ర్ పాత్ర‌లో మ‌న‌సులు గెలుచుకుంది. ఆ త‌రువాతి స్థానం గౌత‌మ్‌, యామినిల‌ది. యామినిగా రాశీ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఎక్కువ స‌న్నివేశాల్లో రాశి ఏడుస్తూనే క‌నిపించడం ఆ పాత్ర మ‌రింత‌గా ప్రేక్ష‌కుల్లోకి వెళ్ల‌కుండా చేసింది. కేథ‌రిన్ ఇజ‌బెల్ల పాత్ర‌లకు అంత ప్రాధాన్య‌త లేదు. దాంతో ఒక విధంగా వారి పాత్ర‌లు వేస్ట‌యిపోయాయి అని చెప్పొచ్చు.

సాంకేతిక వ‌ర్గం:

ల‌వ్‌స్టోరీస్‌కి తెలుగులో గోపీసుంద‌ర్ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయారు. ఆయ‌న చేసిన సినిమా అంటే మినిమ‌మ్ గ్యారెంటీ అనే ముద్ర‌ప‌డిపోయింది. ఇటీవ‌ల తెలుగులో ఆయ‌న చేసిన చిత్రాలేవీ ఫ్లాప్‌గా నిల‌వ‌లేదు. మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ విజ‌యాన్నే ద‌క్కించుకున్నాయి. దాంతో ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే వుంటుంద‌ని అంతా భావించారు. పాట‌లు, నేప‌థ్య సంగీతం విష‌యంలో గోపీ సుంద‌ర్ నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చాడు. జ‌య‌కృష్ణ గుమ్మ‌డి ఫొటోగ్ర‌ఫీ బాగుంది. ప్ర‌తీ ఫ్రేమ్ ని అందంగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిటింగ్ మ‌రింత ప‌దును పెడితే బాగుండేది. ఉన్నంత వ‌ర‌కు బాగానే వుంది కానీ మ‌రింత క్రిస్పీగా క‌ట్ చేస్తే బాగుండేది. క్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్ కొత్త‌గా వుంది. అయితే దాన్ని మ‌రింత ప్ర‌భావ‌వంత‌గా న‌డిపించి స్క్రీన్‌ప్లే విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేది.

విశ్లేష‌ణ‌:

ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ చాలా ట‌ఫ్ క‌థ‌ని ఎంచుకుని ఈ సినిమా తీశాడు. అయితే అందుకు త‌గ్గట్టుగా స్క్రీన్‌ప్లేని ప‌క్కాగా రాసుకుంటే బాగుండేది. అలా చేస్తే ఫ‌లితం మ‌రోలా వుండేది. మూడు క‌థ‌ల్ని ప్యార్‌ల‌ల్‌గా న‌డిపించినా అన్ని క‌థ‌ల్ని లింక‌ప్ చేయ‌డం, ఆ ఫీల్‌ని, మ్యాజిక్‌ని క్రియేట్ చేయ‌డంలో మాత్రం ఫెయిల్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. ఫ‌స్ట్ హాఫ్‌ని అద్భుతంగా న‌డిపించిన ఆయ‌న సెకండ్ హాఫ్‌కి వ‌చ్చేస‌రికి అన‌వ‌ర‌మైన ట్రాక్‌ల‌ని జోడించి క‌న్ఫ్యూజ‌న్‌కి గురైన‌ట్టు తెలుస్తోంది. ఒక విధంగా సెకండ్ హాఫ్‌లో చేతులెత్తేసిన భావ‌న క‌లుగుతుంది. నిడివి కూడా ఓ మైన‌స్‌గా మారింది. ప్రేక్ష‌కుడి మూడ్‌ని డీవేట్ చేస్తూ అస‌హ‌నాన్ని క‌లిగించేలా వుంది. ఇన్ని డ్రాబ్యాక్స్ వున్న ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే. అత‌ని క్రేజే ఈ సినిమాని కాపాడాలి.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

సీసీసీ నిధికి చేరిన 6 కోట్లు కార్మికుల అకౌంట్లోకి!

మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటు చేసిన సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)కి ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల‌కు మించి విరాళాలు అందాయి. చిరు, నాగ్‌, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ.....

రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా?

ద‌ర్శ‌క‌ధీర అంటూ జేజేలందుకుంటున్న రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. జ‌క్క‌న్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1`...

క‌రోనా సినిమాలు చూడొచ్చు క‌దా శేష్‌?

టైమ్ చూసి టైమ్ బాంబ్ లా ఏదో ఒక కొత్త‌ద‌నం ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రావ‌డం గూఢ‌చారి హీరో శేష్ ప్ర‌త్యేక‌త‌. ఇంత‌కుముందు గూఢ‌చారి అలాంటి సినిమానే. ఉన్న‌ట్టుండి ప‌రిమిత బ‌డ్జెట్...

ఇంట్లో క్వారంటైన్ అని చెప్పి కుర్ర‌హీరోతో బెడ్ రూమ్‌లో

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర రాజ్యం పేద రాజ్యం అనే తేడా లేకుండా అన్నిటినీ చుట్ట‌బెట్టేసింది. ఈ స‌మ‌యంలో సెల‌బ్రిటీ ప్ర‌పంచం.. సామాన్య ప్ర‌జ‌లు అనే...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

వైట్ల వ‌ర్సెస్ కోన‌: క‌త్తుల‌తో పొడుచుకునేంత లేదు కానీ!

దర్శ‌కుడు శ్రీనువైట్ల‌-రైట‌ర్ కొన వెంక‌ట్ జోడీ సూప‌ర్ స‌క్సెస్ ల గురించి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఢీ`..`రెడీ`.. `దూకుడు`..`బాద్ షా` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. ఈ విజ‌యాల‌తోనే శ్రీ‌ను...

క‌రోనా సాయం: ద‌ర్శ‌క‌ధీరతో ఎవ‌రికీ ఏ ఉప‌యోగం లేదా?

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి కేవ‌లం స్టార్ హీరోలు.. కొంత మంది చిన్న హీరోలు... డైరెక్ట‌ర్లు.. కొద్ది మంది సాంకేతిక నిపుణులు మాత్రమే విరాళాలిచ్చారు. కోట్లాది రూపాయ‌లు దండుకున్న ఏ...

హీరోల పెళ్లిళ్లే కాదు అంద‌రి పెళ్లిళ్లు వాయిదా!

పెళ్లి వేడుక అంటే సామూహికంగా జ‌రిగేది. బంధుమిత్రులు బంధాలు అనుబంధాలు అన్నిటికీ ఇదో వేదిక‌. అంతేకాదు ఇప్పుడున్న ప‌రిస్థితిలో పెళ్లి చేసుకోవ‌డం అంటే పెను ప్ర‌మాదంతో పెట్టుకున్న‌ట్టే. కోరి ముప్పు కొని తెచ్చుకున్న‌ట్టే....

ర‌చ్చకెక్కి హ‌ద్దులు దాటుతున్న మహేష్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్‌లో ఒక హీరో సినిమా రిలీజ్ అవుతోంటే మ‌రో హీరో ఫ్యాన్స్ చేసే ర‌చ్చ ఈ మ‌ధ్య తారా స్థాయికి చేరుతోంది. ఈ సంక్రాంతికి ఇద్ద‌రు స్టార్ హీరోలు మ‌హేష్ నటించిన `సరిలేరు...

`పోకిరి` హాట్ గాళ్ ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్య‌హ‌!

2006లో వ‌చ్చిన ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ `పోకిరి`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కి...