Home Entertainment బ్యాచ్ లర్ లైఫ్ కి పులిస్టాప్ పెట్టేసిన నితిన్

బ్యాచ్ లర్ లైఫ్ కి పులిస్టాప్ పెట్టేసిన నితిన్

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో మొదలుపెడితే .. విజయ్ దేవరకొండ దాకా టాలీవుడ్ లో బ్యాచ్ లర్స్ లిస్ట్ చాలా పెద్దదే .. కానీ తాజాగా యంగ్ హీరో నితిన్ త‌న బ్ర‌హ్మ‌చ‌ర్యానికి మంగ‌ళం పాడేశాడు. దాదాపు 8 ఏళ్లుగా ప్రేమిస్తున్న షాలినితో నితిన్ ఎంగేజ్‌మెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. ప‌సుపు కొట్టే కార్య‌క్ర‌మంతో పెళ్లి హంగామాని మొద‌లుపెట్టేశారు. నితిన్ ఎంబీఏ స్టూడెంట్ షాలిని ప్రేమిస్తున్నాడ‌ని, త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించిన విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌నాల‌పై స్పందించ‌ని నితిన్ సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకుపోయాడు. త‌న‌పెళ్లిపై ఎన్ని వార్త‌లు ప్ర‌చారంలో వున్నా వాటిని లైట్ తీసుకున్న నితిన్ గ‌త ఏడాది ఓ ఇంట‌ర్వ్యూలోనే 2020లో వివాహం చేసుకోబోతున్న‌ట్టు హింట్ ఇచ్చేశాడు.

అన్న‌ట్టుగానే పెళ్లివార్త‌ని తాజాగా బ‌య‌ట‌పెట్ట‌డంతో వ‌రుస ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. గ‌త ఎనిమిదేళ్లుగా త‌న ఫ్యామిలీ ఫ్రెండ్ షాలినితో నితిన్ ప్రేమ‌లో వున్నారు. ఇరు కుటుంబాల పెద్ద‌లు వీరి పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ శ‌నివారం గ్రాండ్‌గా నితిన్‌- షాలినిల ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది, ఈ కార్య‌క్ర‌మంలో నితిన్‌, షాలినికి సంబంధించిన ఇరు కుటుంబాల వాళ్లు మాత్ర‌మే పాల్గొన్న‌ట్టు తెలిసింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో అత్యంత వైభవంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌ర‌హాలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. ఇరు కుటుంబాల‌కు చెందిన వాళ్ల‌తో పాటు అత్యంత స‌న్నిహితులు, సినీ సెలబ్రిటీస్ మాత్ర‌మే ఈ వెడ్డింగ్‌లో పాల్గొన‌నున్నార‌ని తెలిసింది. త‌న వెడ్డింగ్ ప‌నులు ప‌సుపు కొట్టే కార్య‌క్ర‌మంలో మొద‌ల‌య్యాయ‌ని హీరో నితిన్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు.

Recent Posts

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...