fbpx
Home Cinema ఆమె లేదనే సినిమా చేయనని ఆపేసాడా అఖిల్ ?

ఆమె లేదనే సినిమా చేయనని ఆపేసాడా అఖిల్ ?

అఖిల్ కొత్త చిత్రానికి బ్రేక్, కారణం ఆమే

అక్కినేని వంటి పెద్ద సినీ ఫ్యామిలీ నుంచి వచ్చినా అఖిల్ కు కలిసిరాలేదు. ఓపినింగ్స్ రప్పించటం దాకా వారసత్వం ఉపయోగపడినా హిట్ కు మాత్రం తను ఎంచుకున్న కథలు, డైరక్టర్సే అడ్డుపడుతున్నారు. ఇప్పటికి అఖిల్ తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్లు అవటం మానసికంగా దెబ్బ కొట్టేదే.అయితే రెట్టించిన ఉత్సాహంతో అల్లు అరవింద్ చేతిలో తన కెరీర్ ని పెట్టి భవిష్యత్ వైపు చూస్తున్నాడు. అయితే తాజాగా ఆ సినిమాకు కూడా బ్రేక్ పడిందని సమాచారం. అయితే అందుకుకారణం అఖిలే అని తెలుస్తోంది.

అఖిల్ తో చేయటానికి ఏ స్టార్ హీరోయిన్ ఉత్సాహం చూపటం లేదు. పోనీ ఉన్నవాళ్లతో ముందుకు వెళ్దామంటే ముదురు హీరోయిన్స్ దొరుకుతున్నారు. అయితే డబ్బుకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సినిమాలు కమిటయ్యే పూజ హెడ్గే మాత్రం అఖిల్ తో సై అంది. తనకి మెగా క్యాంప్ కు ఉన్న అనుభందంతో గీతా ఆర్ట్స్ కు ఓకే అనేసింది. అఫ్ కోర్స్ గట్టి చెక్ తోనే కొట్టారని వినికిడి. అయితే ఆమె డేట్స్ మాత్రం ఖాళీ లేవు. నవంబర్ దాకా తనతో కష్టం అనేసింది.

మరో హీరోయిన్ తో వెళ్లిపోదామని బొమ్మరిల్లు భాస్కర్ చెప్పినా..ఈ లోగా స్క్రిప్టు మరింత మెరుగులు దిద్దుతో పూజ హెడ్గే వచ్చాకే సినిమా చేద్దామని అఖిల్ అన్నాడట. దాంతో అల్లు అరవింద్ కూడా సరే…ఆ అమ్మాయి వచ్చేకా సినిమా మొదలెట్టండి..అర్జెంట్ ఏముంది..వచ్చే సమ్మర్ కు రిలీజ్ చేద్దామని అన్నాడు. అఖిల్ మాత్రం తనకు లేటు అయినా ఫర్వాలేదు కానీ పూజ ఉండాల్సిందే అని పట్టుపట్టాడట.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}