fbpx
Home Cinema వాసనల్ని గుర్తించలేను...అందుకే పెళ్లి చేసుకోలేదు

వాసనల్ని గుర్తించలేను…అందుకే పెళ్లి చేసుకోలేదు

క్యాథరీన్ కు ఎందుకు పెళ్లి కావటం లేదో చెప్పేసింది

“నాకు పుట్టిన దగ్గర నుంచి ఓ సమస్య ఉంది. నేను వాసన పసిగట్టలేను. నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న నాకు పెళ్లి చేయాలని చూస్తున్నా వాసన పసిగట్టలేని నా ప్లాబ్లం వల్ల నాకు పెళ్లి అవ్వడం లేదు. ఒకవేళ ఇదే సమస్యతో నాకు పెళ్లి అయితే, పుట్టిన పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోగలనా లేదా అని నాకు భయం. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు.” అంటోంది క్యాథరిన్. కంగారుపడకండి ఇదేమీ ఆమె నిజ జీవిత హెల్త్ ఇష్యూ కాదు. తన కొత్త సినిమాలోని పాత్రఎవగురించి ఆమె చెప్పిన విషయం ఇది.

సిద్దార్థ్ హీరోగా నటించిన వదలడు అనే సినిమాలో తన పాత్రను ఇలా వర్ణిస్తూ చెప్పుకొచ్చింది క్యాథరీన్. ఈ సినిమాలో తను జ్యోతి అనే టీచర్ పాత్రను పోషిస్తున్నానని, వాసనల్ని పసిగట్టలేని పాత్ర అని అంటోంది. క‌ల్తీ ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్లే క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌న్న కాన్సెప్ట్‌లో ఈ చిత్రం వ‌స్తుంది. 450 థియేట‌ర్ల‌లో భారీగా విడుద‌ల చేస్తున్నాము అన్నారు. ఈ స్టోరీలో పాయింట్ న‌చ్చి ఒప్పుకున్నాను. క్వాలిటీ ఫుడ్ కాకుండా ఎందుకు డ‌బ్బులు తీసుకుని ఇలాంటిది ఇస్తున్నారు అన్న కాన్సెప్ట్‌లో క‌థ ఉంటుంది అన్నారు.

సిద్ధార్ధ‌, క్యాథ‌రిన్ జంట‌గా సాయిశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న చిత్రం వ‌ద‌ల‌డు. పారిజాత క్రియేష‌న్స్ ప‌తాకం పై టి. అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్ నిర్మాత‌లుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}