fbpx
Home Politics కేసీఆర్ ను ఎదుర్కోవడానికే విజయ శాంతి కాషాయ మంత్రం

కేసీఆర్ ను ఎదుర్కోవడానికే విజయ శాంతి కాషాయ మంత్రం

కేసీఆర్ ను ఎదుర్కోవడానికే విజయ శాంతి కాషాయ మంత్రం

విజయశాంతి మళ్ళీ పార్టీ మారుతున్నారట . ప్రస్తుతం విజయ శాంతి కాంగ్రెస్ పార్టీలో స్టార్ కాంపైనర్ గా వున్నారు . తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ పదవులను గెలుచుకుంది . విజయ శాంతికి కాంగ్రెస్ పార్టీలో సమున్నత స్థానమే ఇచ్చారు . అయినా విజయ శాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారట . ఈ నెల 18న హైదరాబాద్ లో జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో విజయ శాంతి చేరబోతున్నారట . ఒకప్పుడు ఎల్ .కె . అద్వానీ ఆహ్వానంతో భారతీయ జనతా పార్టీలో చేరింది .

తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో విజయ శాంతి ” తెలుగు తల్లి ” పార్టీ పేరుతో ఓ రాజకీయ పార్టీ ప్రారంభించింది . కారణం దాసరినారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన “ఒసే రాములమ్మ ” సినిమా ద్వారా అనూహ్యమైన పేరు సంపాదించింది . ఆ పేరు తన పార్టీకి ఓట్లుగా మారిపోతుందని విజయ శాంతి నమ్మింది . అయితే పార్టీ పెట్టిన తరువాత కానీ .. సన సత్తా , తన గ్లామర్ ఏమిటో తెలిసిరాలేదు . “తల్లి తెలంగాణ ” పార్టీ తనని రాజకీయ భవిష్యత్తు కు చేర్చదని ఆమెకు అర్ధమైంది . ఇక ఆలస్యం చెయ్యకుండా కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావును కల్సి తన తల్లి తెలంగాణ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసింది .

చంద్ర శేఖర్ రావు , విజయ శాంతి అన్నా చెల్లెలు గా రాష్ట్రమంతా తిరిగారు . ధర్నాలు చేశారు , వంటా వార్పుల్లో , సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు . 2009 ఎన్నికల్లో మెదక్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి నెగ్గింది . ఆ తరువాత తెలంగాణ రాష్ట్రము సిద్దించడానికి ముందు కాంగ్రెస్లో చేరింది . 2014 లో మళ్ళీ మెదక్ నుంచి పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయింది . 2019లో ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కేవలం ప్రచారం మాత్రమే చేసింది . 13 సంవత్సరాల తరువాత విజయ శాంతి మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరూ ” చిత్రంలో నటిస్తున్నది .

ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ ఉండదని భావించిన విజయ శాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఆమెను భారతీయ జనతా పార్టీలో చేర్పించడానికి నిర్ణయించుకున్నారట . తెలంగాణాలో బీజేపీ కి ఆశాజనకమైన వాతావరణం కనిపిస్తుంది . తన రాజకీయ ప్రత్యర్థి చంద్ర శేఖర్ రావును దెబ్బ తీయాలంటే తనకి బీజేపీ మాత్రమే సరైన వేదికని విజయ శాంతి భావిస్తున్నట్టు తెలుస్తుంది .

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ