Home Politics పవన్ కళ్యాణ్ "మన నది - మన నుడి" వెనుక అసలు రహస్యం!

పవన్ కళ్యాణ్ “మన నది – మన నుడి” వెనుక అసలు రహస్యం!

తెలుగు సినిమా నటుడు  పవన్ కళ్యాణ్ ,రాజీకీయాలలో కి అడుగుపెట్టి దాదాపు దశాబ్దకాలం అవుతుంది. మూడు నాలుగు సినిమాలు భారీ విజయం సాధించడంతో  పాటు వారసత్వంగా అయన సోదరులనుండి వచ్చిన అభిమాన సంపదతో రాజకీయాలలోకి వచ్చారు. మరి ఇక్కడ అయన ఏమి సాధించారో అయన నోటితోనే చెబితే బాగుంటుంది.

ఇక పొతే 2014 ఎన్నికల నాటినుండి టీడీపీ కి అయన పల్లకి మోస్తున్న సంగతి తెలిసిందే,అయితే ఈ మధ్య అయన టీడీపీ ని పల్లకీలోనుంచి దింపి నెత్తికి ఎత్తుకున్నారు అని  అంటున్నారు ప్రజలు. టీడీపీ ఇరుకున పడిన ప్రతి సారి అయన నేనుఉన్నాను అంటూ టీడీపీ పట్ల అయన చూపించే విశ్వాసం చూస్తె విస్మయంతో పటు ,అయన జెనసేన అధ్యక్షుడా లేక నిఖార్సైన టీడీపీ కార్యకర్త ? అనే అనుమానం కలుగుతుంది అని అనుకుంటున్నారు.

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన నాణ్యతతో కూడిన విద్య లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడతామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేటి సమాజాం లో ఆంగ్లభాష ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలిసిందే. సాంకేతికంగా ఎంత నైపుణ్యం ఉన్నపట్టకి ,కమ్యూనికేషన్ స్కిల్స్ లేక పోవటంతో  ఉన్నతమైన అవకాశాలు అంది పుచ్చుకోవడంలో ముందుకు సాగలేకపోతున్నారు నేటియువత. దీనికి పరిష్కారం ప్రాధమిక స్థాయినుండి ఆంగ్లభాషలో  విద్యాబోధన చెయ్యడమే.

రాబోయే తరానికి ఒక దారిచూపే ఈ మార్పును ఏ మాత్రం ఆశ్చర్యం లేకుండా ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ నాయకులూ వ్యతిరేకిస్తూ వచ్చారు. అదేవిధంగా నటుడు పవన్ కళ్యాణ్ కూడా తూ.చా తప్పకుండ టీడీపీ ని గుడ్డిగా అనుసరించి ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహుత్తర కార్యక్రమాన్ని విమర్శించారు. అయన స్థితిని స్థాయిని మరచిపోయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. తెలుగును చంపేస్తున్నారు అంటూ తీవ్రమైన భాష ప్రయోగంతో అంతులేని ఆవేదనకు గురి అయ్యారు. ఒకానొక స్థాయిలో  అయన ఇంగ్లీష్ మాధ్యమానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష చెయ్యాలి అని పార్టీ నాయకులతో చర్చింనట్టు తెలుస్తుంది. “తెలుగు రాష్టం కోసం ఆనాడు పొట్టి శ్రీరాములు ,తెలుగు భాష కోసం ఈనాడు నటుడు పవన్ కళ్యాణ్” అనే నినాదం తో ముందుకుపోవాలి  అనుకున్నట్టు సమాచారం.

అయితే ఇసుక కోసం నారా లోకేష్ చేసిన నాలుగు గంటల(11 :00  AM నుండి 3 :00 PM  వరకు) దీక్షకు వచ్చిన స్పందనను గుర్తుకు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు , నటుడు పవన్ కళ్యాణ్ ను అటువంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు అని సలహా ఇచ్చారంట. అయితే మాటమీద నిలబడటం లో సత్యహరిచంద్రుడుకే ఆదర్శవంతమైనవాడు(అని అయన అభిమానులు,అంతులేని జనసేన ఓటర్లు అనుకుంటారు) అయిన నటుడు పవన్ కళ్యాణ్ , నిరాహారదీక్షకు బదులుగా “మన నది -మన సుడి” అనే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇది ఇలా జరుగుతుండగా మరో వైపు టీడీపీ నాయకులూ ,బిజెపి పెద్దలు ,రాజ్యాంగ పదవులలో ఉన్న మహానానుభావులు ఎందరో తెలుగు భాషకు  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం( అని ప్రతిపక్షం వారు అనుకుంటున్నారు) గురించి మీడియా సాక్షిగా ఆక్రోశించారు , ఆవేదన వెళ్లగక్కారు. నారా లోకేష్ గారు కూడా స్పందించారు తెలుగులో; అయితే ప్రజలనుండి సరిఅయిన స్పందన రాకపోవడం, పైగా మీ పిల్లలు చదువుతున్న మాధ్యమం ఏమిటి, మీరు వ్యాపారాలు చేస్తున్న విద్యాలయాల మాట ఏమిటి అని ఎదురు ప్రశ్నలు ప్రజలలో నుంచి వినిపించేసరికి , “తెలుగు” పోరాటం ముగించారు.

ఇదంతా గమనించని నటుడు పవన్ కళ్యాణ్ ” మన నది – మన సుడి ” అంటూ ముందుకు సాగాలనుకున్నారు. అలవాటు ప్రకారం ఎటువంటి ఆశ్చర్యం లేకుండా ఒక చక్కటి ఉదయాన చంద్రబాబు నాయుడు గారు ” ఆంగ్ల మాధ్యమానికి మేము వ్యతిరేకం కాదు ” అని ప్రకటించే సరికి నటుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకులా తయారు అయ్యింది . ఆ విధంగా ” మన నది – మన సుడి ” అనే మహత్తర ప్రజాక్షేమ కార్యక్రమం ముగిసిపోయింది. నటుడు పవన్ కళ్యాణ్ మాత్రం “తెలుగు” పోరాటాన్ని మధ్యలోనే వదిలేసిన చంద్రబాబుని ఏమి అనకుండా మరోసారి “తెలుగు”దేశం పై తన ప్రేమను చాటుకున్నారు .

నోట్ : ఒకానొక ఆంగ్ల ఇంటర్వ్యూ లో టీవీ వారు ఆంగ్లంలో అడిగిన ప్రశ్న అర్ధం కాక పక్కన ఉన్న మనోహర్ వైపు ఆర్తిగా చుసిన దృశ్యం ఇంకా ప్రజల మనసులలో చెరిగి పోలేదు

మల్లెల హరి నాగరాజు

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ