fbpx
Home ఆంధ్ర & తెలంగాణ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ అలా కోల్పోయింద‌ట‌

సైనా నెహ్వాల్ బ‌యోపిక్ అలా కోల్పోయింద‌ట‌

వ‌దులుకోవ‌డానికి షాకింగ్ రీజ‌న్ ఉందా?

ఒక సినిమా బిజీలో ఉండ‌గానే మ‌రో రెండు మూడు సినిమాల‌కు క‌మిట‌వుతోంది శ్ర‌ద్ధా క‌పూర్. ఏడాదికి మూడు రిలీజ్ లు త‌ప్ప‌నిస‌రి. 2018-19 శ్ర‌ద్ధా పూర్తి బిజీ. 2020 వ‌ర‌కూ అలాగే బిజీగా ఉంది. ఇటీవ‌లే రిలీజైన చిచ్చో, సాహో (హిందీ) బంప‌ర్ హిట్లు కొట్టాయి. అటుపై మైండ్ బ్లో అనిపించేలా బెస్ట్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌బోతున్న `స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డి` తో బిజీ అయ్యింది. అలాగే భాఘి 3లో న‌టించేందుకు రెడీ అవుతోంది.

అయితే వీట‌న్నిటి న‌డుమ ఎంతో ఎగ్జ‌యిటింగ్  ఆఫ‌ర్ ని కాద‌నుకుంది ఈ భామ‌. ఎంతో మ‌న‌సుప‌డి చేయాల‌నుకున్న సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ని వ‌దులుకోవాల్సి వ‌చ్చిందిట‌. దానికి కార‌ణం ఇన్నాళ్టికి బ‌య‌ట పెట్టింది శ్ర‌ద్ధా. అప్ప‌ట్లో త‌న ఆరోగ్యం బాలేదు. పైగా కాల్షీట్లు సెట్ కాలేదు. స్ట్రీట్ డ్యాన్స‌ర్ సినిమాకి ఇచ్చిన కాల్షీట్ల‌తో క్లాష్ రావ‌డంతో సైనా బ‌యోపిక్ ని వ‌దులుకుంది. రెమో స‌ర్ స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డిలో అవ‌కాశం ఇవ్వ‌డంతో వ‌ద్దు అన‌డానికి వేరొక కార‌ణం ఏదీ లేదు. పైగా ఆయ‌న నాకు టీచ‌ర్ కాబ‌ట్టి .. ఆ పాత్ర‌లో ప్రాధాన్య‌త కాద‌న‌లేనిది కాబ‌ట్టి సైనా బ‌యోపిక్ వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని శ్ర‌ద్ధా తెలిపింది. అయితే శ్ర‌ద్ధా కాద‌నుకోగానే ప‌రిణీతి వ‌ద్ద‌కు వెళ్లింది ఆఫ‌ర్. ఈ చిత్రానికి అమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సైనా బ‌యోపిక్ ఛాన్స్ మిస్స‌య్యాను అన్న రిగ్రెట్ ఫీల‌వ్వ‌డం లేద‌ని శ్ర‌ద్దా ఈ సంద‌ర్భంగా తెలిపింది. అప్పుడు డెంగీ జ్వ‌రం వ‌చ్చి ఇబ్బంది ప‌డ్డాను. ఇంకా నాకోసం వేచి చూడండి అని అమోల్ స‌ర్ కి చెప్ప‌డం న్యాయం కాద‌ని అనిపించింది. అందుకే న‌న్ను తొల‌గించినా దాని గురించి నేను ఆయ‌నను అడ‌గ‌లేదు. నా ముందు ఉన్న రెండు ఛాయిస్ ల‌లో ఒక‌దానిని మాత్ర‌మే ఎంపిక చేసుకోగ‌లిగాను అని శ్ర‌ద్ధా క్లారిటీనిచ్చింది. 2020 జ‌న‌వ‌రిలో స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డి రిలీజ్ కానుంది. వ‌రుణ్ ధావ‌న్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}