fbpx
Home Cinema సంగీత దర్శకుడుకి యాక్సిడెంట్.. కాపాడిన సాయి ధరమ్ తేజ్

సంగీత దర్శకుడుకి యాక్సిడెంట్.. కాపాడిన సాయి ధరమ్ తేజ్

మ్యూజిక్ డైరక్టర్ కు ప్రమాదం,కాపాడిన సాయి

తెలుగు సినిమా సంగీత దర్శకుడుకి రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, ఆ రోడ్ లో వెళ్తున్న హీరో సాయిధరమ్ తేజ్ అతడిని ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

 హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.42 వద్ద మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సంగీత దర్శకుడు అచ్చు గాయపడ్డాడు. అదే సమయంలో అతడి వెనుక వస్తున్న హీరో సాయిధరమ్‌తేజ అతడిని కాపాడాడు.

వివరాల్లోకి వెళితే.. నానక్‌రాంగూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకొని సాయిధరమ్‌ తేజ ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. బైక్ పై ఉన్న వ్యక్తి సుమారు 10 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న సాయి వెంటనే కారు నిలిపివేశాడు.

తీరా అక్కడికెళ్లి చూసేసరికి ప్రమాదానికి గురైన వ్యక్తి తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అచ్చు అని గుర్తించి తన కారులో సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో అచ్చు కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}