fbpx
Home Crime పిల్లాడిపై నుంచి కారు పోయినా అదృష్టం కొద్ది బతికి బయటపడ్డాడు (వీడియో)

పిల్లాడిపై నుంచి కారు పోయినా అదృష్టం కొద్ది బతికి బయటపడ్డాడు (వీడియో)

అదృష్టం బాగుంటే ఎంతటి ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ముంబైలోని ఓ అపార్టుమెంటులో ఓ పిల్లాడు స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. అప్పుడే ఓ యువతి పక్కనే పార్క్ చేసిన కారులోకి వెళ్లి కూర్చుంది. ఇంతలో షూలేస్ ఊడిపోవడంతో కారుకు కొద్ది దూరంలో కూర్చున్న పిల్లాడు… వాటిని కట్టుకోవడం మొదలు పెట్టాడు.

అయితే పిల్లాడిని గమనించని ఓ యువతి కారును స్టార్ట్ చేసి అతని కారు పై నుంచి పోనిచ్చింది. దీంతో ఆ బాలుడిని కొద్ది దూరం తోసుకెళ్లిన కారు.. అనంతరం అతని పై నుంచి వెళ్లిపోయింది. అదృష్టం కొద్ది బాలుడు కారు మధ్యలోకి జారిపోవడంతో స్వల్పగాయాలతో బయట పడ్డాడు. ప్రమాదం తర్వాత బాలుడు లేచి స్నేహితుల దగ్గరకు పరిగెత్తాడు. ఆ వీడియో కింద ఉంది చూడండి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ