fbpx
Home Cinema జయలలిత బయోపిక్‌ కు రంగం సిద్ధం

జయలలిత బయోపిక్‌ కు రంగం సిద్ధం

జయలలిత బయోపిక్‌ కు రంగం సిద్ధం అయింది నిత్యామీనన్ జయలలిత పాత్రలో ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తోందిట! ఈ విషయం గురించి నిత్యామీనన్ ను పలకరిస్తే ‘రెగ్యులర్‌ చిత్రాలకు, బయోపిక్‌కి చాలా తేడా ఉంది. కల్పిత పాత్రలనుకోండి మన ఇష్టం వచ్చినట్లు మనం చేయొచ్చు. అదే నిజజీవిత పాత్రలనుకోండి వాళ్లు నడిచినట్లు నడవాలి, చూసినట్లు చూడాలి అంతా వాళ్లలా కనిపించాలి.

అయితే నాకు ఈ విషయమై వత్తిడి ఏమీ లేదు. ఒకవేళ వత్తిడి అనిపిస్తే సరిగ్గా పని చేయలేరు. ఈ సినిమాలో అందరం బాగా చేయగలుగుతామనే నమ్మకంతో ఉన్నాం. ‘ఎప్పుడు ఆరంభించాలి? ఎప్పుడు విడుదల చేయాలనే’ది ముఖ్యమైన విషయంగా దర్శకురాలు ప్రియదర్శిని అనుకోవడంలేదు. మంచి ఉత్తమమైన చేయాలనుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ