fbpx
Home ఆంధ్ర & తెలంగాణ ఆయ‌న ఈగోని అల్లు అర‌వింద్, బ‌న్ని ఎలా భ‌రిస్తున్నారు?

ఆయ‌న ఈగోని అల్లు అర‌వింద్, బ‌న్ని ఎలా భ‌రిస్తున్నారు?

బన్నివాసు ఈగో-స్వార్థం ఎలా భ‌రిస్తున్నారు?

జీఏ2 అధినేత బ‌న్ని వాసుపై న‌టి సునీత బోయ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌ల గురించి తెలిసిందే. గీతా ఆర్ట్స్ కంపెనీ ఆర్టిస్టుగా ప‌ని చేస్తున్న సునీత బోయ జ‌న‌సేన పార్టీలోనూ ప‌ని చేస్తున్నారు. అయితే ఉన్న‌ట్టుండి బ‌న్ని వాసు త‌న‌కు అవ‌కాశాలివ్వ‌కుండా వేధించార‌ని పోలీస్ కేసులు పెట్టి ఏడిపించార‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఛాంబ‌ర్ ఎదుట వినూత్న నిర‌స‌న‌తో మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనిపై బ‌న్ని వాసు వివ‌ర‌ణ ఇచ్చారు. సునీత బోయ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌కే అవ‌కాశాలివ్వ‌లేద‌ని అన్నారు. దేనిని బ్యాలెన్స్ చేసే స్వ‌భావం లేద‌ని విమ‌ర్శించారు. అయితే తాజాగా దీనిపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు సునీత బోయ మీడియా ఎదుటికి వచ్చారు.సునీత బోయ మాట్లాడుతూ.. నేను బ్యాలెన్స్ చేయ‌లేద‌ని అన్నారు బ‌న్ని వాసు. దానికి స‌మాధానం చెబుతా. 13రోజుల పాటు ఏడ్చుకుంటూ ఉన్న న‌న్ను అత‌డు పోలీసుల‌కు ప‌ట్టించారు. అవ‌కాశాలివ్వ‌క‌పోవ‌డ‌మే కాదు.. మ‌మ్మ‌ల్ని సెక్సువ‌ల్ గా వేధించ‌డ‌మే కాకుండా తిరిగి మ‌మ్మ‌ల్ని పోలీసుల‌కు ప‌ట్టించారు. అలాంట‌ప్పుడు ఎలా ఉంటుంది మా ప్ర‌వ‌ర్త‌న‌. ప‌రిశ్ర‌మ ఇలా రోడ్ పైకి వ‌చ్చిందంటే ఆడాళ్లు చాంబ‌ర్ ఎదుట బ‌ట్ట‌లు విప్పేసేంత వ‌ర‌కూ వెళ్లారు అంటే మీకు చేత‌కాక‌పోవ‌డం వ‌ల్ల‌నే. కోట్లు పెట్టి సినిమాలు ఎలా చేస్తున్నారు?  సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఎవ‌రూ రోడ్ల పాలు చేయ‌లేదు. మెగా ఫ్యామిలీకి.. మెగా నిర్మాత‌ల‌కు నేను ఎంతో సాయం చేశాను. అది వాళ్ల‌కు తెలుసు. అల్లు అరవింద్ గారికి తెలియాల‌నే ఇలా రోడ్ పైకి వ‌చ్చాను.  వివాదాలొస్తే ఇప్పుడున్న‌ అసోసియేష‌న్లు వృధా. వాళ్లు ఏమీ చేయ‌లేరు. నాకు అసోసియేష‌న్ లో మెంబ‌ర్ షిప్ కార్డ్ కూడా లేదు. అందుకే నేను ఎవ‌రికీ చెప్ప‌లేదు. నేను బ‌న్నివాసును క‌లిసి చెప్పాల‌నుకుంటే పోలీసుల‌కు ప‌ట్టించారు. పోలీసుల‌కు ప‌ట్టించకుండా ఎందుకు వ‌చ్చావు? అని అడిగితే స‌రిపోయేది. సైలెంటుగా నా దారిన‌ వెళ్లిపోయేదానిని… అని ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు. గీతా ఆర్ట్స్ మాత్ర‌మే కాదు.. ఏ ఆడ‌పిల్ల అయినా ఫ‌లానా వాడు వేధిస్తున్నాడ‌ని చెబితే మీడియాల‌కు వెళ్ల‌కుండా చేయాల్సింది దానిని నిర్మూలించాల్సిన బాధ్య‌త కంపెనీదే. డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ మొద‌లు కాస్టింగ్ డైరెక్ట‌ర్లు వేధిస్తుంటారు. ప్ర‌తి నిర్మాత చేయాల్సింది. వేధించే వారిని తీసేస్తామ‌ని అన‌లేరా?  వాళ్లు నిరంత‌రం షూటింగులు చేసుకుంటారు. కానీ ఆడాళ్లు మాత్రం అవ‌కాశాల్లేక వేధింపుల‌కు గుర‌వుతారు. కోడైరెక్ట‌ర్, అసిస్టెంట్ డైరెక్ట‌ర్, కాస్టింగ్ డైరెక్ట‌ర్ల‌దే ఆ బాధ్య‌త‌.

ఆయ‌న ఈగో అల్లు అర‌వింద్- అల్లు అర్జున్ ఎలా భ‌రిస్తున్నారు?

అల్లు అర్జున్ స‌పోర్ట్ నాకు ఉంది ఏం చేసినా చెల్లుతుంద‌నుకున్నావా బ‌న్ని వాసు? అల్లు అర‌వింద్ గారిని కూచోబెట్టి స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో ఆలోచించు. నీవ‌ల్ల 13రోజులు నిమిష నిమిషం ఏడ్చాను. నా ఏడుపు చాలా చెడ్డ‌ది. దేవుడు ఉన్నాడు కాబ‌ట్టి.. గొలుసులు క‌ట్టుకుని పోరాడే ధైర్యం వ‌చ్చింది. నేను ఏ ప‌ని చేసినా దేవుడిచ్చిన‌ ధైర్య‌మే. ప‌వ‌న్ క‌ల్యాణ్ ని చూసో జ‌న‌సేన‌ను చూసో కాదు. నాన్న‌కు ఆరోగ్యం బాలేదు.. అని జీఏ2 ఆఫీస్ లో చెప్పినా పోలీసుల‌కు ప‌ట్టించారు. న‌న్ను ఏడిపించ‌డం ఆపేయండి. న‌న్ను ఎంత ఏడిపిస్తే అంతా నాశ‌నం అవుతారు. ఆగ‌స్టు 1న పోలీసుల‌కు ప‌ట్టించారు. ఎలాంటిచోట కూచోబెట్టావ్ నన్ను? బ‌న్ని వాసు-  స‌త్య మీరు వెళ్లి పోలీసులు కూచోబెట్టిన చోట కూచోండి. మీ భార్య‌ను.. మీ పిల్ల‌ల్ని కూచోబెట్టండి. మీరు చేసిన త‌ప్పుల వ‌ల్ల గీతా ఆర్ట్స్ ప‌రువు పోతోంది. మూడుసార్లు ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేయాల్సి వ‌చ్చింది?  నేను ఇంత ఎందుకు చేయాల్సొచ్చిందో ఆలోచించండి. నేను ఎందుకు సినిమాలివ్వాలి. సాయం చేయాలి అనే ఈగో బ‌న్నివాసుకు ఉంది. అది పోవాలి… అని ఆరోపించారు. అల్లు అర్జున్- అర‌వింద్ ఎలా భ‌రిస్తున్నారు? అని సునీత ప్ర‌శ్నించారు.

గీతా ఆర్ట్స్ లో నువ్వు 16ఏళ్లు.. మా నాన్న 30 ఏళ్లు!

గీతా ఆర్ట్స్ లో నువ్వు 16 ఏళ్లుగా శ్ర‌మిస్తున్నావు. ఎంత క‌ష్ట‌ప‌డ్డావో తెలుసు. మా నాన్న 30ఏళ్లు ప‌ని చేశారు. నా క‌ష్టం నీకు తెలియాలి అని బోయ సునీత బ‌న్ని వాసునుద్ధేశించి అన్నారు. ఇప్ప‌టికీ మించిపోయిందేం లేదు. పిలిపించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారా?  లేదు నేను ఎందుకు సాయం చేయాలి? అని ఉంటారా?  లేదంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ గారిని క‌లుస్తాను. సాయం చేయ‌మ‌ని అడుగుతాను. అల్లు అర‌వింద్ గారికి ఆడ‌పిల్ల లేద‌నుకుంటాను. నీకు ఉంది క‌దా?  బ‌న్నివాసు నీకు ఆడ‌పిల్ల ఉంది క‌దా?  ఇండ‌స్ట్రీలో ఎలా బాగుప‌డ‌తావో చూస్తాను. ఎలా టాప్ ప్రొడ్యూస‌ర్ అవుతావో చూస్తాను. ఆడ‌పిల్ల‌ను ఏడిపిస్తే అలా త‌గులుతుంది శాపం. ఎంత‌మంది ఆడ‌పిల్ల‌ల్ని ఏడిపించావో? .. అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు సునీత‌.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ