fbpx
Home Cinema డైరక్టర్ ..‘చీప్ స్టార్’అన్నది రవితేజనా ?

డైరక్టర్ ..‘చీప్ స్టార్’అన్నది రవితేజనా ?

అజయ్ భూపతి ‘చీప్ స్టార్’అన్నది ఆ హీరోనేనా ?

వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఆచితూచి స్క్రిప్టులు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలోలాగ ఏ డైరక్టర్ తో పడితే ఆ డైరక్టర్ తో, ఏ స్క్రిప్టు కు పడితే ఆ స్క్రిప్టుకు ఓకే చెప్పటం లేదు. వరుసబెట్టి సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో `డిస్కో రాజా` సినిమా చేస్తున్నాడు. క్రిస్‌మస్ సమయంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా తర్వాత `ఆర్‌ఎక్స్100` దర్శకుడు అజయ్ భూపతితో `మహాసముద్రం` సినిమా చేయబోతున్నట్టు న్యూస్ లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఆగిపోయినట్టు తాజాగా ఓ గాసిప్ బయటకు వచ్చింది. అజయ్ భూపతి చెప్పిన స్క్రిప్ట్ కి రవితేజ కన్వీన్స్ కాలేదని, అందుకే సినిమా చేయడానికి అంగీకరించలేదని సమాచారం. ఇదంతా సినిమా ఇండస్ట్రీలో కామన్ అనుకుంటున్న సమయంలో అజయ్ భూపతి మాత్రం ఉన్నట్లు ఉండి ‘చీప్ స్టార్’ అని ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ట్వీట్ రవితేజను దృష్టిలో పెట్టుకునే అజయ్ ట్వీట్ చేశాడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే కనుక నిజమైతే రవితేజ ఊరుకుంటాడా…ఆయన ఫ్యాన్స్ ని ఆపగలమా… మరో ప్రక్క అజయ్ భూపతి మాత్రం ఇదే స్క్రిప్ట్ ను నాగ్ చైతన్యకి చెప్పాలని చూస్తున్నాడట. సమంతకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చిందట.

ఇక అజయ్‌కు కాకుండా గోపీచంద్ మలినేనికి రవితేజ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు `క్రాక్` అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రవితేజ స్టైల్‌లో ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ