fbpx
Home Cinema Bollywood వైరల్ ఫొటో : బికినీతో ...బీచ్ లో అనుష్క

వైరల్ ఫొటో : బికినీతో …బీచ్ లో అనుష్క

బికినీలో కేక పెట్టిస్తున్న అనుష్క

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఈ జంట గురించిన ప్రతీ వార్తా మీడియాలో సెన్సేషన్. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పక్కర్లేదు సంచలనమే. ఈ జంటకు చెందిన ప్రతి విషయం గురించి తెలుసుకోవడానికి క్రికెట్‌ అభిమానులతోపాటు ఇటు సినీ లవర్స్ కూడా ఇంట్రస్ట్ కనబరుస్తుంటారు. దానికి తగట్టుగానే విరాట్‌ కూడా సోషల్‌మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు.

వెస్టిండిస్ పర్యటన అనంతరం లభించిన విశ్రాంతి సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండిస్ పర్యటనను ముగించుకుని భారత్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సరదాగా గడుపుతున్నాడు.

తాజాగా విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటో ఓ బీచ్ దగ్గర దిగినది కావడం విశేషం. అందులో అనుష్క శర్మ బికినీని ధరించగా… విరాట్ కోహ్లీ అర్ధనగ్నంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు కోహ్లీ అనుష్క ఒడిలో సేదతీరుతున్నాడు. ఈ ఫోటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దాంతో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫొటో షేర్‌ చేసిన రెండు గంటల్లోనే 17 లక్షల మంది లైక్‌ కొట్టారంటే అర్థం చేసుకోండి ఈ జంటకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో. మరొపక్క అనుష్క శర్మ కూడా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బీచ్‌లో సరదాగా గడుపుతున్న కొన్ని చిత్రాలను పోస్ట్‌ చేస్తూ ‘వాటర్‌ బేబీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ చిత్రాలకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}