fbpx
Home Cinema ముంబై లో విజయ్ దేవరకొండ హిందీ సినిమా ప్రయత్నాలు?

ముంబై లో విజయ్ దేవరకొండ హిందీ సినిమా ప్రయత్నాలు?

విజయ్ దేవరకొండ తాజా సినిమా ‘డియర్ కామ్రేడ్’ ఆశించినంత ఫలితం ఇవ్వకపోయినా ఈయన క్రేజ్ కు వాటిల్లిన నష్టం లేదని తెలుస్తోంది. ఎందుకంటే సినిమా ప్లాప్ అయినా దానితో సంబంధం లేకుండా అతనికి హిందీ సినిమా అవకాశాలు తలుపు తడుతున్నాయి.

దాంతో ఆ సంగతి చూద్దామని ప్రస్తుతం ముంబై లో ఒక యాడ్ ఫిలిం షూటింగ్ కోసం వెళ్లిన విజయ్ దేవరకొండ వరుసగా దర్శకుల కధలు వింటున్నాడు. అతనికి కథ నచ్చితే కరణ్ జోహార్ ఆ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేం ఉంది హీరో పచ్చ జెండా ఒప్పందమే తరువాయి.

తెలుగు సినిమాల విషయానికి వస్తే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా చివరి దశకు చేరింది. ఆ పైన వచ్చే జనవరి నుండి పూరి జగన్నాధ్ తో సినిమా మొదలవుతుంది. అటు సినిమాలతోను ఇటు యాడ్లతోనూ తీరిక లేకుండా ఉన్నాడు మన అర్జున్ రెడ్డి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}