fbpx
Home Cinema విజయ్ దేవరకొండ, పూరి చిత్రం టైటిల్ ఇదేనా? !

విజయ్ దేవరకొండ, పూరి చిత్రం టైటిల్ ఇదేనా? !

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ చిత్రం టైటిల్ 

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్..ఇద్దరూ ఫెరఫెక్ట్ కాంబినేషన్. రెగ్యులర్ గా సినిమాకు వెళ్లేవారికి వీళ్లద్దరి యూటిట్యూట్ పరిచయమే. క్యారక్టరైజేషన్ తో నే సినిమాని నిలబెట్టే వీళ్లద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. ఎలాంటి సినిమా రాబోతుందీ అనేది ఆసక్తికరమే.అలాగే తన సినిమాలకు విభిన్నమైన టైటిల్స్ పెట్టే పూరి ఈ సినిమాకు ఏం పెట్టబోతున్నాడనేది ఆసక్తికరం.

అందుతున్న సమాచారం ప్రకారం పూరి ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఫైటర్ టైటిల్ చాలా బాగుంటుందని భావిస్తున్నాడట. దీనిపై ఎటువంటి అఫీషియల్ ఎనౌన్సమెంట్ లేకపోయినప్పటికీ ఇదే ఫైనలైజ్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. డిసెంబర్ కి ఈ చిత్రం సెట్స్ పైకెళ్లే అవకాశం ఉంది.

ఈమేరకు వీళ్ళద్దరు కలిసి లొకేషన్స్ స్కౌటింగ్ మొదలెట్టేసారు. హైదరాబాద్ సిటీలోకల్ లోనే షూటింగ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇక వీళ్లద్దరి కాంబినేషన్ లో రెడీ అయ్యే ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు.. అలాగే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}