Home Cinema నల్లమలను కాపాడుకుందాం - విజయ దేవరకొండ

నల్లమలను కాపాడుకుందాం – విజయ దేవరకొండ

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కోసం ప్రభుత్వం ఉద్యుక్తమవుతున్న వేళ దానిని ఆపాలంటూ నిరసనలు సదా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం స్వయంగా పవన్ కళ్యాణ్ ‘సేవ్ నల్లమల’ అంటూ ఉద్యమం చేయనున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది తమ వంతుగా గొంతు కలుపుతున్నారు. అంతకు ముందు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా సేవ్ నల్లమల కు తన మద్దతు తెలియచేసారు. ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ మేరకు పిలుపునిచ్చారు.

‘20,000 ఎకరాల నల్లమల అడవిని నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేసాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితి కి వచ్చాము. గాలి , నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే సోలార్ ఎనర్జీ ని వినియోగం లోకి తెద్దాం. ప్రతి పై కప్పు పై సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసే చట్టాలు చేద్దాం స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఎలక్ట్రిసిటీ తో ఏమి చేయాలి…? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం.
నల్లమలను కాపాడుకుందాం. మనకోసం, మన భవిష్యత్ కోసం’ అని పిలుపునిచ్చారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ